హెల్త్‌ ఎమర్జెన్సీ కోసం 10న కలెక్టరేట్ల వద్ద నిరసన

నేడు గచ్చిబౌలిలోని టిమ్స్‌ వద్ద ధర్నా
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గం నిర్ణయం
ప్రజాపక్షం / హైదరాబాద్‌ రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని, కరోనాను ఆరోగ్య శ్రీ కింద చేర్చాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 10న అన్ని జిల్లాల కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ ఆసుపత్రి ప్రారంభోత్సం జరిగి రెండు నెలలైనా ఇప్పటికీ రోగులకు సేవలు అందించకపోవడానికి నిరసనగా బుధవారం గచ్చిబౌలిలోని టిమ్స్‌ వద్ద ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. జూమ్‌ యాప్‌ ద్వారా సోమవారం జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశ వివరాలను మఖ్దూంభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయని, హైదరాబాద్‌లో ప్రజలు అరచేతిలో ప్రా ణాలు పెట్టుకొని బతుకుతున్నారన్నారు. కరో నా పాజిటివ్‌ వచ్చిన వారికి సరైన చికిత్స అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులు ఇదే అదునుగా దోచుకుంటున్నాయని విమర్శించా రు. కరోనా సోకి ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఫీవర్‌ ఆసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుల్తానాకు సైతం రోజుకు రూ.1.15 లక్షలు కట్టకపోతే చికిత్సను నిలిపివేయడం దారుణమన్నారు. డాక్టర్ల పరిస్థితితే ఇలా ఉంటే సామాన్యు ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ కింద చేర్చాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్‌ చేసిందని తెలిపారు. గతంలో మాదిరిగానే రేషన్‌ కార్డు దారులకు నెలకు 12 కిలోల బియ్యం రూ.1500 కొనసాగించాలని డిమాండ్‌ చేశా రు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. రక్షణ రంగం, ఎల్‌ఐసి, రైల్వేల్లో కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ యత్నా లు, 50 బొగ్గు బ్లాకుల వేలం, విద్యుత్‌ సవరణ చట్టం- 2020, మూడు రైతాంగ వ్యతిరేక ఆర్డినెన్స్‌లు వంటి నిర్ణయాలపై త్వరలో అఖిలపక్ష రౌండ్‌ టేండ్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆల్మట్టి ఎత్తుపై అఖిలపక్షం నిర్వహించాలి
కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును 519 నుండి 524 అడుగులు, 100 టిఎంసిల నుండి 223 టిఎంసిల సామర్థ్యాన్ని పెంచాలనే కర్నాటక ప్రభుత్వం నిర్ణయించిందని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి అఖిలపక్ష బృందాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు ప్రాతినిధ్యం చేయడానికి ఢిల్లీకి తీసుకెళ్ళాలని రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం డిమాండ్‌ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కృష్ణా జలాల ఆధారిత జిల్లాలకు అన్యాయం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్‌ నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో త్వరలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతులు,వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఎఐకెఎస్‌, బికెఎంయుల సంయుక్తంగా జులై 10 నుండి 20 వరకు ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలకు సిపిఐ మద్దతునిస్తోందన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో జరిగే ఆందోళనలకు సహకరిస్తామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?