హుజూర్‌నగర్ : టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. శనివారం ఆయన అంతకుముందు ఆయన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హుజూర్‌నగర్ ప్రాంత ప్రజలే తనకు బిడ్డలతో సమానమన్నారు. పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని తెలిపారు. దాదాపు 70వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘నాకు పిల్లలు లేరు.. ఈ ప్రాంత ప్రజలే నాకు పిల్లలని భావించి పనిచేశాను’ అని ఉత్తమ్ తెలిపారు. అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా హుజూర్‌నగర్‌లోని గణేశ్ దేవాలయం వద్ద నామినేషన్ పత్రాలకు పూజలు చేయించారు. అనంతరం భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ నామినేషన్
RELATED ARTICLES