హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి

ప్రజా పక్షం / హైదరాబాద్ : నవంబర్ 4న జరుగనున్న నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్ మొదటి స్థాయి పరీక్ష, నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ పరీక్షలకు హాజరయ్యేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్న విద్యార్థులు అక్టోబర్ 30 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాల యం వెబ్ http//bse.telangana.gov.in నందు ఆన్ దరఖా స్తులను ఏ ఐడి పాస్ రిజిస్టర్ చేసుకున్నారో అదే ఐడి పాస్వర్డ్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని పరీక్షల విభాగం సూచించింది. పై పరీక్షలకు నమోదు చేసుకున్న సమయంలో కుల దృవీకరణ పత్రము లు పొందుపరచని ఎస్సి ఎస్టి బిసి విద్యార్థులు, వైద్య దృవీకరణ పత్ర ములను పొందుపరచని అంగవైకల్య విద్యార్థులు కార్యాలయపు వెబ్ సైట్ నందు మీ నామినల్ రోల్స్ లోని ఎడిట్ ఆప్షన్ ద్వారా నవంబర్ 4 లోపు పొందుపరుచాలని సూచించారు. లేని పక్షంలో అట్టి విద్యార్థులు సాధారణ విద్యార్థులుగా పరిగణించబడుతారని తెలిపారు. ప్రత్యేకించి ఎన్టిఎస్‌సి హాజరగుటకు నమోదు ఏసుకున్న బిసి విద్యార్థులు సాధారణ బిసి కుల దృవీకరణ పత్రములకు బదులుగా ఓబిసి దృవీకరణ పత్రము, నాన్ క్రీమిలేయర్ దృవీకరణ పత్రములను పొందుపరచాల్సి ఉంటుందని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?