సిడ్నీ: ప్రముఖ టీవీ షోలో భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కెఎల్. రాహుల్‌లు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్య తప్పగా ఆడుతాడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. పాండ్యా మంచి టాలెంట్ ఉన్న యువ క్రికెటర్ అతను భారత జట్టులో కీలక ఆటగాడు. గొప్ప ఆ ల్రౌండర్గా ఎదుగుతున్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచకప్‌లో భారత్ తరఫున అతను బరి లో దిగితే టీమిండియాకు కలిసొస్తుందని క్లార్క్ అన్నాడు. అతను చేసిన తప్పుడు ప్రశ్చాతాపం పడ్డా డు. పాండ్యాను క్షమించి తిరిగి జట్టులో తీసుకోవాలని చెప్పాడు. మంచి నైపుణ్యం ఉన్న క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో చిక్కుల్లో పడ్డాడు. ఇప్పుడు అతని కెరీర్ ప్రశ్నార్థంగా మారింది. బిసిసిఐ పాండ్యాకు మరో అవకాశం ఇస్తే బాగుంటుందని క్లార్క్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరోవైపు మహిళలపై పాండ్య చేసిన వ్యాఖ్యలపై మాత్రం క్లార్క్ మద్దతు తెలపలేదు. పాండ్యా చేసింది పెద్ద తప్పేనని కానీ అతనికి మరో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు. ఎవరికైన గౌరవ మర్యాదలో ముఖ్యం. మనం ఎదుటి వారిని గౌరవించడం, పెద్దవారికి మర్యాదలు చేయడం అనేవి ముందు తెలుసుకోవాలి. మీరు ఎంత డబ్బు సంపాదించారు అనేది అనవసరం. మీ ప్రవర్తనలు ఎలా ఉన్నాయో, మీరు సెలబ్రెటీగా ఎదిగినప్పుడు మరింతగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది అభిమానులు అనుసరిస్తూ ఉంటారు. వారి మనోభావాలను దెబ్బ తీసే పనులు ఎవరూ చేయకూడదని క్లార్క్ అన్నాడు. హుందాగా ప్రవర్తించాలని సూచించాడు. తప్పులు అందరూ చేస్తారు కానీ వాటి నుంచి గుణపాఠం నేర్చుకున్న వాడే గొప్ప వ్యక్తి అని క్లార్క్ పేర్కొన్నాడు. ఇక పాండ్యా, రాహుల్ వివాదాన్ని పరిష్కరించడంలో బిసిసిఐ జాప్యం చేస్తుందని మాజీ క్రికెటర్ల్లు మండి పడుతున్నారు. ప్రపంచకప్ ప్రారంభమయ్యేందుకు మరో నాలుగు నెలల సమయమే ఉందని ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించి ఎదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని అంటున్నారు. ప్రపంచకప్‌కు ముందు ప్రాక్టీస్ చాలా అవసరమని ఏ నిర్ణయమైన త్వరగా తీసుకుంటే బాగుంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచకప్ జట్టుపై క్లారిటీ వస్తుందని వారన్నారు.
హార్దిక్‌పాండ్యాకు క్లార్క్ మద్దతు
RELATED ARTICLES