HomeNewsTelanganaహరీష్‌ మరో ఔరంగజేబు

హరీష్‌ మరో ఔరంగజేబు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
70 రోజుల్లో 25వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టామని వ్యాఖ్య
ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల అందజేత
ప్రజాపక్షం / హైదరాబాద్‌
“నువ్వు రాజీనామా చెయ్‌… నేను చేసి చూపి స్తా… అని హరీశ్‌ అంటుండు. హరీష్‌ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నా డు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో స్టేడియంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సిఎం రేవం త్‌రెడ్డి, అతిథులుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నామని, యుపిఎస్‌సి తరహాలో టిఎస్‌పిఎస్‌సిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలోనే గ్రూప్‌ 1 పరీక్షను నిర్వహించబోతున్నామన్నారు. పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్‌ ఏం చేశారు? అని ప్రశ్నించారు. మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయారని మండిపడ్డారు. మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బిఆరెస్‌ నిర్లక్ష్యం వహించిందని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. దశ బాగుంటే దిశతో పని లేదని, ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కెసిఆర్‌ తెలుసుకోవాలని సూచించారు. 3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? మా ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టామని, ఇది మీ కళ్లకు కనిపించడం లేదా? అని నిలదీశారు. మీరు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపబోరని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్‌ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్‌ టీచర్‌ పాఠశాలలు మూసేశారని, పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసేసిందని విమర్శించారు.
గురుకులలన్నీ ఒకే చోట
త్వరలో మెగా డిఎస్‌సి ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకోస్తామని, 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్‌లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కొడంగల్‌లో దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నామన్నారు. ఈ మోడల్‌ ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments