స్పెయిన్ విలవిల

ఒక్క రోజే 738 మంది కరోనాతో మరణం
ఇటలీలో ఆరు వేలకు చేరుకున్న కరోనా మరణాలు
స్పెయిన్‌ : కరోనా వైరస్‌ విజృంభనతో స్పెయిన్ విలవిల్లాడిపోతోంది. ఈపాటికే ప్రపంచ దేశాలన్నీ లాక్‌ డౌన్తో నాలుగు గోడల మధ్య నిర్బంధమయ్యాయి.
అయినా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. స్పెయిన్‌లో పరిస్థితులు మరింత భీతావహంగా ఉన్నాయి. వైరస్‌ మరణాల సంఖ్య కరోనా పుట్టిల్లు చైనాను దాటిపోయింది. చైనాలో ఇప్పటివరకు 3,285 మంది మృతి చెందగా, స్పెయిన్‌లో ఈ సంఖ్య 3,434గా ఉంది. కాగా, మంగళవారం ఒక్కరోజే 738మంది మరణించినట్లు అక్కడి పత్రికలు నివేదించాయి. కాగా, కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 16 వేలు మరణించగా, దాదాపు 5లక్షల మంది వైరస్‌ బారిన పడ్డారు. 6వేల కరోనా మరణాలతో ఇటలీ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?