రెండో టెస్టులో పాక్ చిత్తు
కేప్‌టౌట్: పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా జట్టు 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2 సఫారీ జట్టు సొంతం చేసుకుంది. ఇక తమ హోమ్ గ్రౌండ్స్‌లో వరుసగా 7వ సిరీస్ విజయం కావడం మరో విషేశం. ఆదివారం 41 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 9.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సఫారీ జట్టులో డీన్ ఎల్గర్ (24 నాటౌట్; 39 బంతుల్లో 4 ఫోర్లు), ఫప్ డుప్లెసిస్ (3 నాటౌట్) అజేయంగా ఉన్నారు. డి బ్రూన్ (4) పరుగులు చేసి ఔటవ్వగా.. హాషిం ఆమ్లా (2) పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది. సారథి సర్ఫరాజ్ అహ్మద్ (56), షాన్ మసూద్ (44) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. బదులుగా బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికాలో కెప్టెన్ డుప్లెసిస్ (103) అద్భుతం శతకంతో చెలరేగాడు. ఇతర బ్యాట్స్‌మెన్స్‌లో ఓపెనర్ మర్క్మ్ (78), తెంబ బవుమా (75), వికెట్ కీపర్ డికాక్ (59) రాణించడంతో సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులు చేసింది. దీంతో సఫారీ జట్టు 254 పరుగుల భారి ఆధిక్యం సాధించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన పాకిస్థాన్ సఫారీ బౌలర్ల ధాటికి 294 పరుగులకు కుప్పకూలి సౌతాఫ్రికా ముందు 41 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని సఫారీ జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా సారథి పఫ్ డుప్లెసిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
డుప్లెసిస్‌పై ఒక మ్యాచ్ నిషేధం..
రెండో టెస్టు గెలిచి ఆనందంలో ఉన్న సఫారీ జట్టుకు షాక్ తగిలింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా సౌతాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్‌పై ఒక్క మ్యాచ్ నిషేధాన్ని విధిస్తూన్నట్టు ఆదివారం ఐసిసి ప్రకటించింది. మరోవైపు కెప్టెన్ డుప్లెసిస్‌కు మ్యాచ్ ఫీజ్‌లో 20 శాతం, మిగతా ఆటగాళ్లకు 10 శాతం కోత విధించబడింది. ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22.1ను సఫారీ జట్టు ఉల్లఘించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సౌతాఫ్రికా సారథి డుప్లెసిస్ ఒక టెస్టు మ్యాచ్‌కు సస్పెండయ్యాడు. ఇక ఈ నెల 11న పాకిస్థాన్‌తో జరిగే చివరి టెస్టులో డుప్లెసిస్ దూరమయ్యాడు.
సౌతాఫ్రికాకు సిరీస్
RELATED ARTICLES