ప్రజా పక్షం/హైదరాబాద్: చైర్పర్సన్ సోనియాగాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని పిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అ న్నారు. సోనియాగాంధీ జన్మదిన వేడుకలు గాంధీభవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్న గొప్ప వ్యక్తి సోనియాగాం ధీ అని గుర్తు చేశారు. యుపిఎ ప్రభుత్వం హయాంలో ఆహార భద్రత, సమాచార హక్కు, విద్య హక్కు లాంటి పలు ముఖ్యమైన చట్టాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి కోశాధికారి గూడూరు నారాయణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఎన్నికల్లో పో లింగ్ సరళిపై ఎఐసిసి అధ్యక్షులు రాహుల్‌గాంధీ తనకు ఫోన్ చేసి ఆరా తీశారన్నారు. పోలింగ్ సరళీని పరిశీలిస్తే ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని, తాను రాహుల్‌కు వివరించినట్లు తెలిపారు. పోలింగ్ శాతం పెరగడం కాంగ్రెస్‌కే అనుకూలమని పేర్కొన్నారు. ఎంఐఎంతో కాంగ్రెస్ నే తలు టచ్‌లో ఉన్నారా..? అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఎవ రు టచ్‌లో ఉన్నారనే అంశం తనకు తెలియదన్నారు. ఎన్నికల ఫలితాల వి డుదల సమయంలో తాను హైదరాబాద్‌లోనే ఉంటానని ఉత్తమ్ చెప్పారు.
సోనియా వల్లనే తెలంగాణ కల సాకారం
RELATED ARTICLES