టి20 వరల్డ్‌కప్ నిర్వహణపై ఐసిసి నిర్ణయం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో రిజర్వ్‌డే ఉంచాలని ఐసిసి నిర్వహించే సమావేశంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ప్రతిపాదించనుంది. ఇటీవల ఆసీస్‌లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు రిజర్వ్‌డే ఉంచకపోవడంతో ఐసీసీ తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. భారత్సఇంగ్లాండ్ సెమీస్‌కు వరుణుడు అడ్డంకిగా మారడంతో గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న హర్మన్‌సేన ఫైనల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పురుషుల ప్రపంచకప్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలని.. ఐసీసీ నిర్వహించే సమావేశంలో సెమీస్‌కు రిజర్వ్‌డే గురించి సీఏ చర్చించే అవకాశం ఉందని ఐసీసీ ప్రతినిధి తెలిపారు. పురుషుల టీ20 ప్రపంచకప్‌లో రిజర్వ్‌డే ఉంటుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సీఈవో కెవిన్ రాబరడ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ”మహిళల టోర్నమెంట్లో ఏర్పడిన పరిస్థితులు భవిష్యతుల్లో నిర్వహించే టోర్నీలపై ప్రభావం చూపుతుంది. పురుషుల టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో కూడా రిజర్వ్‌డే ఉంచాలని ఎంతో మంది భావిస్తున్నారు. అయితే మహిళల ప్రపంచకప్ సెమీస్‌లో రిజర్వ్‌డే లేనందుకు ఇంగ్లాండ్ మహిళల జట్టుకు ఎంతో బాధ ఉంటుంది. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నున్నా” అని రాబరట్స్ తెలిపారు. ఆసీస్ వేదికగా అక్టోబర్ 18 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 15న జరుగుతుంది.
సెమీ ఫైనల్స్‌లో రిజర్వ్‌డే
RELATED ARTICLES