సిరీస్‌ ఎవరిదో?

గెలుపే లక్ష్యంగా ఇరు జట్టు బరిలోకి
పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా
ధీటుగా జవాబిస్తున్న కరేబియన్స్‌
నేడు చివరి టి20 మ్యాచ్‌
సాయంత్రం 7గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం
ముంబయి : తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించగా.. రెండో టీ20లో విండీస్‌ గెలిచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో బుధవారం టీమిండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. సిరీస్‌ దక్కాలంటే తప్పక గెలవాల్సిన టీ20లో హిట్టర్లతో నిండిన విండీస్‌తో తలపడనుంది. మూడో టీ20 శక్తి మేర పోరాడి సిరీస్‌ చేజిక్కుంచుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. మరి వాంఖడేలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందో ఓసారి పరిశీలిస్తే. ’హిట్‌మ్యాన్‌’ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ రెండు మ్యాచ్‌లలో 8, 15 పరుగులు చేసి విఫలమైనా.. జట్టును ముందుండి నడిపించగలడు. తనదైన రోజున రెచ్చిపోగలడు. మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో క్లాస్‌ ప్లేయర్‌గా గుర్తింపు ఉన్న రాహుల్‌.. ఆరంభంలో బాగా ఆడితే టీమిండియా భారీ పరుగులు చేసే అవకాశం ఉంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి రెచ్చిపోతే తిరుగుండదు. రెండు మ్యాచ్‌లలో పెద్దగా బ్యాటింగ్‌ చేసే అవకాశం రాని శ్రేయాస్‌ అయ్యర్‌ నాలుగో స్థానంలో కీలక ఆటగాడు. వరుసగా విఫలమవుతున్న కీపర్‌ రిషబ్‌ పంత్‌కు కోహ్లీ మద్దతుగా ఉన్నాడు. దీంతో సంజు శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురుకావొచ్చు. సంజు ఏ స్థానంలోనైనా ఆడగలడు. కాబట్టి అతడిని శ్రేయస్‌ స్థానంలో ఆడించొచ్చు. అయితే నాలుగో స్థానానికి శ్రేయస్‌ పరిష్కారమని భావిస్తున్న తరుణంలో కోహ్లీ ఈ సాహసం చేసే అవకాశం దాదాపు ఉండదు. రెండో టీ20లో అర్ధ శతకం అందుకున్న ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె నుంచి జట్టు అదే ప్రదర్శన కోరుకుంటోంది. మరో ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా జట్టులో ఉంటాడు. భువనేశ్వర్‌ కుమార్‌ త్వరగా లయ అందుకోవాలి. భారీగా పరుగులు ఇస్తున్న దీపక్‌ చాహర్‌ స్థానంలో మొహమ్మద్‌ షమీని తీసుకునే అవకాశం ఉంది. వాషింగ్టన్‌ సుందర్‌ పవర్‌ప్లేలో పరుగులను నియంత్రిస్తున్నా.. వికెట్లు తీయకపోవడం ఆందోళనకరం. సుందర్‌ బదులు కుల్‌దీప్‌ను పరీక్షించినా ఆశ్చర్యం లేదు. యుజువేంద్ర చహల్‌ కీలక స్పిన్నర్‌ అన్న విషయం తెలిసిందే. అటు వైపంతా యువ బృందమే. ఇటేమో అనుభవం + కొత్తదనం. ఐనా సరే గెలిచేందుకు తడబడుతోంది టీమిండియా. లక్ష్యాలను విజయవంతంగా ఛేదిస్తున్న కోహ్లీసేన మొదట బ్యాటింగ్‌ చేసినప్పుడు బ్యాట్లెత్తేస్తోంది. ఆఖరి నాలుగు ఓవర్లలో పరుగుల వరద పారించేందుకు ఇబ్బంది పడుతోంది. 40-45 పరుగులైనా చేయాలి. దానికి భిన్నంగా రెండో టీ20లో చివరి 5 ఓవర్లలో వచ్చింది 38 పరుగులే. మ్యాచ్‌ ఫినిషర్ల కొరతను ఇది సూచిస్తోంది. మూడో టీ20లో ఈ సమస్యను అధిగమించకపోతే కష్టం. మంచు కురిసే వాంఖడేలో ఛేదన అత్యంత సులభం. విండీస్‌కు టాస్‌ వరించి ఫీల్డింగ్‌ ఎంచుకుంటే పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరం.
భారత పేలవ ఫీల్డింగ్‌
టీమిండియా ఫీల్డింగ్‌ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పెరిగిన కోహ్లీసేనలో 90ల నాటి ఫీల్డింగ్‌ అవ లక్షణాలు కనిపించడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొదటి టీ20లో 4, రెండో టీ20లో 3 క్యాచులు నేలపాలయ్యాయి. స్వయంగా కెప్టెన్‌ విరాట్‌ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్‌ ఇలాగే ఉంటే ఎన్ని పరుగులైనా చాలవని హెచ్చరించాడు. వాషింగ్టన్‌ సుందర్‌ పవర్‌ప్లేలో పరుగులను నియంత్రిస్తున్నా వికెట్లు తీయకపోవడం ఆందోళనకరం. దీపక్‌ చాహర్‌, భువి త్వరగా లయ అందుకోవాలి. చాహర్‌ స్థానంలో షమి, సుందర్‌ బదులు కుల్‌దీప్‌ను పరీక్షించినా ఆశ్చర్యం లేదు. చివరి పోరులో అర్ధశతకం అందుకున్న ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె నుంచి జట్టు అదే ప్రదర్శన కోరుకుంటోంది. రోహిత్‌ తన సొంత మైదానంలో విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పంత్‌ సమయోచితంగా ఆడినప్పటికీ తన మునుపటి దూకుడు ప్రదర్శించాల్సి ఉంది.
సంజుకు ఈ మ్యాచ్‌లోనైనా..
ఎప్పుడో 2015లో జింబాబ్వేపై ఒక టీ20 ఆడాడు సంజు శాంసన్‌. బంగ్లాదేశ్‌ సిరీస్‌లో చోటు దక్కలేదు. ప్రస్తుత సిరీస్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌లకు ఎంచుకోలేదు. మరి కీలకమైన వాంఖడే పోరులో అతడికి చోటు దక్కుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ జట్టులోకి తీసుకుంటే ఎవరిని పక్కన పెట్టాలన్నది కోహ్లీకి మరో తలనొప్పి. విఫలమవుతున్నా పంత్‌కు మద్దతుగా ఉంటామన్నాడు. రాహుల్‌ అర్ధశతకంతో రాణించాడు. వీరిద్దరిలో ఎవరికీ విశ్రాంతినిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సంజు ఏ స్థానంలోనైనా ఆడగలడు. బహుశా అతడిని శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో ఆడించొచ్చు! కీలకమైన నాలుగో స్థానానికి శ్రేయస్‌ పరిష్కారమని భావిస్తున్న తరుణంలో ఇదెలాంటి సంకేతాలు పంపిస్తుందన్నది మరో ప్రశ్న? కీలకమైన మ్యాచులో ఒక బౌలర్‌ను తగ్గించే ప్రయత్నం విరాట్‌ చేయడు. మరి సంజు ఎదురుచూపులు ఎలా ఫలిస్తాయో చూడాలి.
కలిసికట్టుగా కరీబియన్లు
తిరువనంతపురం విజయంతో పొలార్డ్‌ సేనలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. సిమన్స్‌, లూయిస్‌, హెట్‌మైయిర్‌, పూరన్‌, బ్రాండన్‌ కింగ్‌, పొలార్డ్‌, హోల్డర్‌ ఫామ్‌లో ఉన్నారు. ఏ ఇద్దరు నిలిచినా పరుగుల వరద ఖాయమే. పైగా వాంఖడే పొలార్డ్‌కు కొట్టినపిండి. అక్కడి పరిస్థితులు, పిచ్‌పై పూర్తి అవగాహన ఉంది. అతడు చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవు. బౌలర్లు షెల్డన్‌ కాట్రెల్‌, పియరీ, కెస్రిక్‌ విలియమ్స్‌, హెడేన్‌ వాల్ష్‌ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు. పరుగులనూ నియంత్రిస్తున్నారు. కాబట్టి కోహ్లీసేన అన్ని విభాగాల్లోనూ తమ ప్రణాళికలను పటిష్ఠంగా అమలు చేయాలి. లేదంటే చాలా కష్టం. వాంఖడేలో రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురుస్తుంది. బంతిపై బౌలర్లకు పట్టు చిక్కదు. బ్యాట్స్‌మన్‌ అలవోకగా ఆడతారు. మంచు కీలకమవుతుంది.
బౌలర్లు రాణిస్తే..
ఈ సిరీస్‌లో భారత బౌలర్లు అంతగా రాణించతేకపోతున్నారు. రెండు టి20 మ్యాచ్‌లలో కలిపి కేవలం ఏడు వికెట్లు మాత్రమే పడగొట్టారు. తొలి టి20 మ్యాచ్‌లో యాజువేంద్ర చాహల్‌ రెండు వికెట్లు పడగొట్టినా దారళమైన పరుగులు సమర్పించకున్నాడు. మిగతా వారు ఒక్కక్క వికెట్‌ మాత్రమే దిక్కంచుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్లు రాణించడంతో విజయం సాధించారు. ఇక రెండో టి20 మ్యాచ్‌లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టి పట్టును పరాజయం పాలుజేశారు. దీంతో బౌలర్లపై ఒత్తిడి ఒకింత ఎక్కువే అని చెప్పొచ్చు. అంతకు ముందు విండీస పర్యటనలో భారత బౌలర్లు విండీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అమెరికా గడ్డపై జరిగిన రెండు టి20 మ్యాచ్‌లలో విండీస్‌ కేలవం 95, 98 పరుగులకు కట్టడి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక గయానాలో జిగిన మూడో టి20లోనూ వారీ హావా కొనసాగించారు. మొదటి మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ 1/18, సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ 2/19 రాణించారు. మూడో మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20లోకి ఆరంగేట్రం చేసిన దీపక్‌ చహార్‌ మెరిశాడు. మొదటి కీలక వికెట్లు పడగొట్టి విండీస్‌ను తక్కు స్కోరుకే కట్టడి చేశాడు. 3 ఓవర్లు విసిరిన చహార్‌ కేవలం నాలుగు పరుగులిచ్చి 3 వికెట్టు పడగొట్టడం విశేషం. కాగా, ఈ సిరీస్‌లోనూ సొంత గడ్డపై రెచ్చిపోతే విండీస్‌కు ఓటమి తప్పదు. అంతేకాదు, ఇటీవలె ముగిసిన టెస్టు సిరీస్‌లన్నింటిని ఇన్నింగ్స్‌ విజయ సాధించడంలోనూ భారత బౌలర్ల ప్రతిభా చెప్పలేనిది. అదే జోరుతో ఈ మ్యాచ్‌లోనూ రాణిస్తే టీమిండియా విజయ పరంపర కొనసాగించవచ్చు.

DO YOU LIKE THIS ARTICLE?