సిబిఐ వ్యవస్థలో మిగిలిఉన్న విశ్వసనీయతను, స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ నరేంద్రమోడీ ప్రభుత్వం అర్థరాత్రి దాడి జరిపింది. దీన్ని సమర్థిస్తూ కేంద్రమంత్రులుసహా ప్రభుత్వ అధికార ప్రతినిధులు చేస్తున్న వాదనలు పాలకపార్టీ నాయక ద్వయం ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలను కాపాడటానికి చెబుతున్న కట్టుకధలు తప్ప మరొకటి కాదు. ప్రధానమంత్రి, ప్రతిపక్షనాయకుడు, ప్రధాన న్యాయమూర్తితో కూడిన చట్టబద్ధమైన కమిటీ రెండేళ్ల పదవీకాలానికి నియమించిన సిబిఐ డైరెక్టర్ అలోక్ మోడీషా ద్వయం తెచ్చిపెట్టిన స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలను సమానులుగా చూపడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం పూర్తిగా అసంబద్ధం. వారిరువురూ పరస్పర అవినీతి ఆరోపణలు చేసుకున్న “విచిత్రమైన, దౌర్భాగ్యస్థితినుంచి సిబిఐ విశ్వసనీయతను కాపాడటానికి, దానిపై చట్టరీత్యా పర్యవేక్షణాధికారం కలిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) సిఫారసుపై ఇద్దరినీ తాత్కాలింగా పెక్కనబెట్టి సమన్యాయం పాటించినట్లు ఆర్థికమంత్రి అరుణ్ చెత్త సమర్థనకు దిగారు. ఆస్తానాను సిబిఐలోకి ప్రవేశపెట్టిన నాటినుంచీ అతడు వివిధ ఆరోపణలతో సుప్రీంకోర్టులో పిటిషన్ ఎదుర్కొంటున్నాడు. అతనిపై కనీసం అరడజను అవినీతి కేసులు దర్యాప్తులో ఉన్నాయి. డైరెక్టర్ ఆస్తానా చేసిన అవినీతి ఆరోపణలు అతనిపై ఎఫ్ దాఖలుకు దారితీసిన దర్యాప్తు పర్యవసానమే. మోడీషా ద్వయానికి తమ స్వయంప్రతిపత్తిని సరెండర్ సివిసి తదితర ఏజన్సీలకు అతడు ఫిర్యాదు చేశాడు. ఆస్తానాపై దాఖలైన ఎఫ్ కోర్టు ముందుండగా అతన్ని కొద్దిరోజులపాటు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో, డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ లిరువురునీ నిర్బంధ సెలవుపై పంపటం, కొత్తగా నియమించబడిన తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు, ఆస్తానాపై ఆరోపణలు దర్యాప్తు చేసిన బృందాన్ని బదిలీచేసి కొత్త బృందాన్ని ఏర్పాటు చేయటం ఉద్దేశపూర్వకంగా కనిపిస్తున్నది. డైరెక్టర్ నియమించిన దర్యాప్తు బృందం దాఖలు చేసిన ఎఫ్ కోర్టుకు సిబిఐ ఏమి చెబుతుందో, కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూదాం. చట్టం దాని పని అది చేసుకుపోవటాన్ని అనుమతిస్తే తమ విధేయుడు ఆస్తానా ఎదుర్కోగల పర్యవసానాలను నిరోధిం చేందుకే మోడీషా ద్వయం సిబిఐలో అర్ధరాత్రి డ్రామా అమలు జరిపింది. గోద్రా రైలు దగ్ధం ఘటన అనంతరం గుజరాత్ మైనారిటీలపై హిందూత్వ శక్తులు సాగించిన మారణకాండపై దర్యాప్తు చేసి నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చినవాడు ఆస్తానా. సోహ్రాబుద్దీన్ ఎన్ కేసు నుండి అమిత్ బయటపడేయటంలో కూడా అతని పాత్ర ఉంది. ఈ ‘విధేయత’ను దృష్టిలో ఉంచుకుని సిబిఐని ఆస్తానాకు అప్పగించాలని మోడీషా ద్వయం కోరుకుంది. అలోక్ నియామకానికి ముందు అతన్ని స్పెషల్ డైరెక్టరుగా నియమించటమేగాక తాత్కాలిక డైరెక్టర్ బాధ్యత కూడా అప్పగించారు. ఏలినవారికి సంబంధించిన కేసులు తొక్కిపెట్టటానికి, ప్రత్యర్థులను కేసులతో వేధించటానికి అతడు పనిముట్టు అయినాడు.
ఇదిలాఉండగా, తొలగించబడిన డైరెక్టర్ అలోక్ ప్రభుత్వ చర్యను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు (శుక్రవారం) విచారణకు రానుంది. అనేక కీలకమైన కేసులు దర్యాప్తులో ఉన్నాయని, ఈ ‘సున్నితమైన’ కేసుల్లో ప్రొసీడింగ్స్ ప్రభుత్వం ఇష్టపడడం లేదని అతను తన పిటిషన్ పేర్కొన్నాడు. కాగా ఇరువురు మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ అరుణ్ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ మోడీకి ప్రత్యక్ష పాత్ర ఉన్న రాఫెల్ కుంభకోణంపై విచారణ జరపాలని ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపుతట్టారు. సిబిఐలో ప్రస్తుత పరిణా మాలకు, రాఫెల్ కుంభకోణానికి సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. రాఫెల్ దానికదే అతిపెద్ద కుంభకోణం. దానిపై సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్ నియమించటం అవసరం. రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీయటం మోడీ ప్రభుత్వానికి కొత్తకాదు. ఎన్నికల కమిషన్ ఏదోకమేరకు న్యాయవ్యవస్థలో, స్వయం పాలిత సంస్థల్లో ఇప్పటికే జోక్యం చేసుకున్నారు. సిబిఐ విశ్వసనీయత పునరుద్ధరణ ఇప్పుడు న్యాయవ్యవస్థ చేతిలో ఉంది.
సిబిఐపై ప్రభుత్వ దాడి ఆంతర్యం
RELATED ARTICLES