న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) బాహ్య శక్తు ల ప్రభావానికి లోనై పనిచేశారన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ చేసిన వ్యాఖ్య ఆధారంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోడీని విమర్శించారు. చౌకీదార్(ప్రధాని) న్యాయమూర్తిని ‘కోర్టు-కీలుబొమ్మను’ చే శారన్నారు. దురదృష్టంకొద్దీ ప్రధాని విషయంలో తాను ‘చౌకీదార్’ అనే పదాన్ని పదేపదే వాడాల్సి వస్తోందన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాని బాహ్య శక్తులు రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించాయని, తద్వారా న్యాయపరపాలన సజావుగా సాగలేదని కురియన్ చెప్పిన విషయం ఆధారంగా రాహుల్ ధ్వజమెత్తారు. ‘నిజంపై అధికార అహంకారం పనిచేసింది’ అన్నారు. ‘చౌకీదార్నని చెప్పుకునే ప్రధా ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కోర్టు కీలుబొమ్మగా మార్చా రు’ అని ట్వీట్ చేశారు. దేశంలో నిజాయితీగల న్యాయమూర్తులకు కొదువలేదని, వారు సత్యంపై అధికార అహంకారా న్ని పనిచేయనివ్వబోరని కూడా రాహుల్ చెప్పారు. న్యాయవ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న విషయాన్ని జోసెఫ్ వ్యాఖ్యలు వెల్లడించాయని కాంగ్రెస్ సోమవారం అభిప్రాయడింది. ఈ విషయంలో వేర్వేరుగా పార్లమెంటరీ, న్యా య విచారణలు జరపాలని డిమాండ్ చేసింది.
సిజెఐని ‘కోర్టు కీలుబొమ్మను’ చేశారు: రాహుల్ గాంధీ
RELATED ARTICLES