సింగపూర్: సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత స్టార్ షట్లర్ పివి సింధు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె చైనా క్రీడాకారిణి వాంగ్ జియిపై 21 11 21 తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్ లో గుయెన్ థుయి లిన్ (వియత్నాం)ను అతి కష్టం మీద ఓడించిన సింధు, ఆతర్వాత అసాధారణ ప్రతిభ కనబరచింది. క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారిణి హాన్ యూ (చైనా)పై అనూహ్య విజయాన్ని నమోదుచేసింది. సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన సయెనా కవకమీపై సునాయసంగా నెగ్గింది. ఫైనల్‌లోనూ అదే దూకుడును కొనసాగించి, మొదటి సెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. అయితే, రెండో సెట్‌లో గట్టిపోటీనిచ్చిన ప్రత్యర్థి వాంగ్ ఆ సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీనితో ఫలితాన్ని తేల్చే చివరి, మూడో సెట్‌లో సింధు సర్వశక్తులు ఒడ్డింది. ఆ సెట్‌తోపాటు టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. కాగా, పురుషుల సిగిల్స్ టైటిల్‌ను ఆంథోనీ సినిసుక జింటింగ్ (ఇండోనేషియా) గెల్చుకున్నాడు. ఫైనల్‌లో అతను కొడయ్ నరవొకాను 23 21 ఆధిక్యంతో ఓడించి టైటిల్ అందుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో ఇండోనేషియా జోడీ లియో రోలీ కర్నాడో, డానియల్ మార్టిన్ తమ దేశానికే చెందిన ఫజర్ అల్‌ఫియాన్, మహమ్మద్ రియాన్ ఆర్డియంతో జోడీపై 9 21 21 తేడాతో గెలుపొంది, టైటిల్ మహిళల డబుల్స్ టైటిల్ కూడా ఇండోనేషియాకే దక్కడం విశేషం. అప్రియాని రహయు, సితి ఫదియా సిల్వ రమధాన్ తి 21 21 ఆధిక్యంతో జాంగ్ షుజియాన్, జెంగ్ యు (చైనా) జోడీని ఓడించారు.
సింగపూర్ ఓపెన్ క్వీన్ సింధు
RELATED ARTICLES