దోహా: భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే సంచలనం సృష్టించాడు. ఏకంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అత్యుత్తమ టైమింగ్ 8:21:37తో పరుగెత్తి తన పేరిట ఉన్న నాలుగు జాతీయ రికార్డులను అధిగమించాడు. వచ్చే ఏడాది జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే ఈ అథ్లెటిక్స్‌లో 8:22:00 టైమింగ్‌లోపే లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. దీంతో శుక్రవారం నాటి పోటీలో అవినాశ్ నిర్ణీత సమయంలోనే లక్ష్యాన్ని చేరుకొని 13వ స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండగా అవినాశ్ ఇదివరకు భారత ఆర్మీలో సియాచిన్, రాజస్థాన్ ప్రాంతాల్లో విశిష్ఠ సేవలు అందించాడు. గత జూన్ నుంచి ఇప్పటివరకు 3వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో అత్యుత్తమ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. గతేడాది గువాహటిలో నిర్వహించిన అంతర్‌రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో 8:49:25 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోగా.. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఫెడ్ కప్‌లో 8:29:94 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నాడు. అలాగే ప్రపంచ స్థాయి హీట్స్‌లో 8:25:33 రికార్డు నమోదు చేయగా ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్‌లో 8:21:37 టైమింగ్‌తో తన రికార్డులు తానే అధిగమించాడు.
సాబ్లే రికార్డులు
RELATED ARTICLES