అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పూర్తి
త్రిపుల్ సెంచరీవైపు పరుగులు
ముంబయి x హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ
ముంబయి : ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ముంబయి ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ దండయాత్ర కొనసాగుతోంది. అతని నిర్ధాక్షిణ్యమైన బ్యాటింగ్‌కు బౌలర్లు బలవుతూనే ఉన్నారు. ప్రత్యర్థి మారినా.. వేదిక ఏదైనా అతని విధ్వంసం మాత్రం మారడంలేదు. బౌండరీల మోత ఆగడం లేదు. మొన్న అజేయ ట్రిపుల్ సెంచరీతో ఉత్తర ప్రదేశ్ బౌలర్లను చీల్చి చిండాడని సర్ఫరాజ్ ఖాన్.. నేడు హిమాచల్ బౌలర్లను ఉతికారేశాడు. సోమవారం ధర్మశాల మైదానం వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో ముంబయి తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ (213 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 226 బ్యాటింగ్) వీర విహారం చేశాడు. 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అద్భుత డబుల్ సెంచరీతో గట్టెక్కించాడు. 199 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకొని మరో ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ, తర్వాత డబుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సర్ఫరాజ్ ఖాన్ గుర్తింపు పొందాడు. అతని కన్నా ముందు తమిళనాడు ప్లేయర్ వీవీ రామన్ ఒక్కడే 1989లో 313, 200తో ఈ ఫీట్ సాధించాడు.
ముంబయి పటిష్ట స్థితిలో..
సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసానికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 5 వికెట్లకు 372 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్‌తో సహా శుభమ్ రంజేన్(75 బంతుల్లో 7 ఫోర్లు 44 బ్యాటింగ్) ఉన్నాడు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి హిమాచల్ ప్రదేశ్ బౌలర్లు షాకిచ్చారు. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి ముంబయి 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట స్థితిలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ తన గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగిస్తూ చెలరేగాడు. సిద్ధేష్ లాడ్ 20) ఔటైనా.. కెప్టెన్ ఆధిత్య తారే(62)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతనితో కలిసి ఐదో వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. బ్యాడ లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను త్వరగా నిలిపివేయగా.. సర్ఫరాజ్ క్రీజులో ఉన్న శుభమ్ రంజేన్‌తో కలిసి 158 పరుగులు జోడించాడు. సర్ఫరాజ్ ఖాన్ ధాటికి ప్రత్యర్థి బౌలర్లు పోటాపోటిగా పరుగులు సమర్పించుకున్నారు.
ట్రిపుల్‌తో దిగ్గజాల సరసన..
గత మ్యాచ్‌లో సాధించిన అజేయ ట్రిపుల్ సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ముంబయి తరఫున ఈ ఘనతనందుకున్న ఏడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, విజయ్ మర్చంట్, అజిత్ వాడెకర్ సర్ఫరాజ్ ఖాన్ కన్నా ముందు ముంబై తరఫున ట్రిపుల్ సెంచరీలు సాధించారు. సర్ఫరాజ్ ట్రిపుల్ సెంచరీ ఓవరాల్‌గా ముంబయి తరఫున 8వది కాగా.. వసీం జాఫర్ రెండు సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. చివరికి ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా.. కెరీర్‌లో సర్ఫరాజ్ ఖాన్ ( 391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 నాటౌట్) ఇదే అత్యుత్తమ స్కోరుగా నిలిచింది.
సర్ఫరాజ్ మరోసారి
RELATED ARTICLES