అటార్నీ జనరల్ వేణుగోపాల్‌కు సుప్రీం ఆదేశం
యుద్ధం ఆపమని పుతిన్‌కు ఆదేశించమంటారా?
న్యూఢిల్లీ : ఉక్రేన్‌కు దక్షిణ ప్రాంతంలో ఉన్న రుమేనియా సరిహద్దులకు చేరుకుని అక్కడ గడ్డకట్టే చలిలో నిలిచిపోయిన భారతీయ విద్యార్థులకు తక్షణం తగిన సహాయం అందించాలని కేంద్ర అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్‌కు కు సుప్రీంకోర్టు గురువారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఆయన తన పరపతి ఉపయోగించి రుమేనియా సరిహద్దుల వద్ద ఇరుక్కుపోయిన భారతీయ వైద్య విద్యార్థులను సురక్షితంగా మన దేశానికి తరలించేందుకు సహకారం అందించే ఏర్పాట్లు చేయాలని కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ సారథ్యంలో జస్టిస్ ఎ ఎస్ బోపన్న, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దుల్లో నిలిచిపోయిన భారత్‌కు చెందిన వైద్య విద్యార్థులపట్ల సానుభూతితో అత్యవసర ప్రాతిపదికపై ఈ విజ్ఞాపనను ధర్మాసనం ఉటంకించింది. యుద్ధంతో తల్లిడిల్లిపోతున్న ఉక్రేన్ నుండి విమానాలు ఎక్కేందుకు సరిహద్దులకు చేరుకునే భారతీయ విద్యార్థులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరింది.
“దయచేసి మాకు చెప్పండి, ఒక సర్వోన్నత న్యాయస్థానంగా మేం ఏ చెయ్యాలి? ఏం చేయగలమో చెప్పండి?” అని జస్టిస్ ఎన్ వి రమణ అటార్నీ జనరల్‌ను కోరారు.
“తక్షణం యుద్ధం విరమించాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్‌కు ఆదేశం ఇవ్వమంటారా?” అని ఉక్రేన్‌లో చిక్కుకుపోయిన పిటిషనర్ ఫాతిమా అహనా తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టు ధర్మాసనం ఎదుట హాజరయ్యేవరకు కోర్టు రూములో ఆయనకోసం ఎదురు చూడవలసిందిగా అంతుకుముందు ధర్మాసనం ఫాతిమా అహనా తరపు న్యాయవాదిని కోరింది. ఉక్రేన్ నుండి వచ్చిన విద్యార్థులు ఇంకా పెద్ద సంఖ్యలో రుమేనియా సరిహద్దుల్లో చిక్కుకుని ఉన్నారని బెంగళూరు ఇందిరా నగర్‌కు చెందిన ఉక్రేన్‌లో ఉన్న వైద్య విద్యార్థిని ఫాతిమా అహనా పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫాతిమా ఉక్రేన్‌లో ఉన్న 250 మంది విద్యార్థులలు రుమేనియాలో ప్రవేశించకుండా ఉక్రేన్ సరిహద్దుల్లో ఉ డిపోయారని ఆమె సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
ఒడెస్సాలోని నేషనల్ మెడికల్‌యూనివర్సిటీలో 2017 నుడి రు. గట్టకట్టుకుపోయే చలిలో వారు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆమె తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం రుమేనియాకు ప్రత్యేక విమానాలు నడపడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. గడ్డకట్టే చలిలో 1000 మంది విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారని పిటిషనర్ లిపారు. “మేం కాదనడం లేదు, మీరు మీ పరపతి ఉపయోగించండి, ఏదో ఒకటి చెయ్యండి” అని ధర్మాసనం అటార్నీ జనరల్‌కు ఫాతిమా అహనా తరపున విజ్ఞప్తి చేసింది. దీనిపై అటార్నీ జనరల్ స్పందిస్తూ, ప్రధానమంత్రి కూడా రష్యా దేశాధ్యక్షుడితో ఈ సమస్యపై మాట్లాడారని, దీనిపై అన్ని కోణాల్లోనూ పరిశీలించి కేంద్ర చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పోలాండ్, హంగరీ, రుమేనియాలకు విమానాలు ప్రత్యేకంగా నడుపుతున్నామని అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. ఎంతోమంది బాలికలు అక్కడ గడ్డకట్టే చలిలో చిక్కుక్కున్నారని, మాకు ఈ విషయంలో సానుభూతి ఉందని, చర్యలు తీసుకుటున్నామని చెప్పారు. అయితే వేణుగోపాల్ ఈ కేసులో, “రుమేనియా సరిహద్దుల్లో చిక్కుకున్న విద్యార్థులు రుమేనియా సరిహద్దులలో ఉక్రేన్‌లో ఉండిపోయారా? లేక వారు సరిహద్దులు దాటి రుమేనియాలోకి వచ్చారా? అని వివరణ కోరారు.విద్యార్థుల తరపున హాజరైన న్యాయవాది ఎ ఎం దార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఇంకా ఉక్రేన్‌లోనే రుమేనియా సరిహద్దుల సమీపంలో ఉన్నారని చెప్పారు. వారు సరిహద్దులు దాటి రుమేనియాలోకి ప్రవేశించలేదన్నారు. కొంతమంది విద్యార్థులు వీడియోలను, మీడియా సంస్థలు వార్తలను వైరల్ చేస్తూ, ఇంకా భారత ప్రధాన న్యాయమూర్తి ఎందుకు పుతిన్‌కు యుద్ధం ఆపమని ఆదేశాలు జారీ చేయడం లేదని ఆ వీడియోలో ప్రశ్నిస్తున్నారని ధర్మాసనం పేర్కొంటూ, ఈ విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను, వారి ఆవేదన అర్థమైంది, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ప్రజలు చనిపోతున్నారు,కానీ మనం ఆ సమస్యలో లేం కదా అని ధర్మాసనం పేర్కొంది.మేం అంగీకరిస్తున్నాం, అయితే చెప్పండి, మమ్మల్ని ఏం చెయ్యమంటారు? అని ధర్మాసనం ప్రశ్నించగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఆదేశాలు ఇవ్వాలని, తక్షణం దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాలనని, పిటిషనర్ కోరారు.రిట్ ఆఫ్ మేండమస్‌ను జారీ చేయండి, వెంటనే మన విద్యార్థులకు నిత్యావసరాలు, మందులు, ఆహారం, దుప్పట్లు, షెల్టర్ ఇమ్మని ఆదేశించండి అని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.
సరిహద్దుల్లో విద్యార్థులకు సహకరించండి
RELATED ARTICLES