స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి యుద్ధ నౌక
న్యూఢిల్లీ: పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారత తొలి యుద్ధనౌక ‘విక్రాంత్’ ను అధికారులు బుధవారం సముద్ర జలాల్లో కి ప్రవేశపెట్టడంతో, ఈ రంగంలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. అధికారులు విడుదల చేసిన ప్రకటనను అనుసరించి భారత్,పాక్ మధ్య జరిగి న యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్‌కు 50 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా అదే పేరుతో ఈ యుద్ధనౌక ను ప్రవేశపెట్టారు. 40 వేల టన్నుల బరువున్న ఎయిర్‌క్రాఫ్ట్‌లను తీసుకెళ్లే ఈ నౌక ప్రస్తుతం సీ ట్రయల్స్‌ను సాగిస్తుంది. వచ్చే ఏడాది ఇది పూర్తి స్థాయిలో భారత నౌకాదళానికి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ‘విక్రమాదిత్య’ ఒక్కటే ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌గా సేవలు అందిస్తుండగా, త్వరలోనే ‘విక్రాంత్’ దాని సరసన చేరుతుందని అధికారులు ప్రకటించారు. స్వ దేశీ పరిజ్ఞానంతో యుద్ధనౌకలను తయారు చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్ చేరడాన్ని ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. భారత్‌లో తయారు చేసిన అతిపెద్ద యుద్ధ నౌక కూడా ఇదేనని వారు వివరించారు.
సముద్ర జలాల్లోకి ‘విక్రాంత్’
RELATED ARTICLES