సఫారీలకు కళ్లెం

తిప్పేసిన స్పిన్నర్‌ అశ్విన్‌
తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే ఆలౌట్‌
భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం
సౌతాఫ్రికాతో రెండో టెస్టు
పుణె: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 275 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్‌ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 36/3తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సఫారీసేన 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన క్వింటన్‌ డికాక్‌ (31)తో కలిసి దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ (64; 117 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కానీ, వీరిద్దరినీ అశ్విన్‌ పెవిలియన్‌కు పంపించడంతో సఫారీసేన మరోసారి కష్టాల్లో పడింది. కానీ, కేశవ్‌ మహారాజ్‌ (72; 128 బంతుల్లో 12 ఫోర్లు), ఫిలాండర్‌ (44నాటౌట్‌; 177 బంతుల్లో 6 ఫోర్లు) అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్‌కు శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మహారాజ్‌ను అశ్విన్‌ బోల్తా కొట్టించడంతో 109 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. మూడో రోజు ఆఖరి ఓవర్లో రబాడ (2)ను కూడా అశ్విన్‌ పెవిలియన్‌కు పంపించడంతో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో అశ్విన్‌ (4/69), ఉమేశ్‌ యాదవ్‌ (3/37) రాణించారు.
మహారాజ్‌ పోరాటం..
భారత్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ కేశవ్‌ మహరాజ్‌, ఫిలాండర్‌ జోడీ అద్భుతంగా పోరాడుతోంది. ఆతిథ్య బౌలర్ల ధాటికి 162 పరుగులకే 8వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ జట్టుకు మెరుగైన స్కోరు అందిస్తున్నారు. ముఖ్యంగా భారత సంతతి ఆటగాడు కేశవ్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట సంయమనంతో ఆడి అర్ధశతకం సాధించాడు. మహరాజ్‌కు ఇదే అరంగేట్ర హాఫ్‌సెంచరీ కావడం విశేషం. క్లిష్టపరిస్థితుల్లో విలువైన పరుగులు చేసిన కేశవ్‌ను గ్యాలరీల్లో ఉన్న అభిమానులు చప్పట్లతో అభినందించారు. తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లు ఆడిన సౌతాఫ్రికా 8 వికెట్లకు 249 పరుగులు చేసింది. మహరాజ్‌(54), ఫిలాండర్‌(38) క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా ఇంకా 352 పరుగుల వెనుకంజలో ఉంది. ఆఖరి రెండు వికెట్లను పడగొట్టి ఇన్నింగ్స్‌కు తెరదించాలని కోహ్లీసేన తీవ్రంగా శ్రమిస్తోంది.
ఉదయమే భారీ షాక్‌..
ఓవర్‌నైట్‌ స్కోర్‌ 36/3తో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ భారత పేసర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. మొదటగా షమీ వేసిన 18వ ఓవర్‌లో నోర్జె (3) స్లిప్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఇక ఉమేశ్‌ యాదవ్‌ వేసిన 21వ ఓవర్‌లో డిబ్రుయిన్‌ (30) కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. దీంతో మూడో రోజు ఉదయమే సఫారీ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డుప్లెసిస్‌, డికాక్‌లు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ స్కోర్‌ బోర్డును ముందుకు నడిపారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం జోడించారు. క్రీజులో కుదురుకున్న డికాక్‌ (31; 48 బంతుల్లో 7×4)ను అశ్విన్‌ బౌల్‌ చేసి భారత్‌కు ఊరటనిచ్చాడు. భోజన విరామ సమయానికి దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
టెయిలెండర్లతో కష్టాలు..
దక్షిణాఫ్రికా టెయిలెండర్లు ఫిలాండర్‌, కేశవ్‌ మహారాజలు భారత బౌలర్లను విసిగిస్తున్నారు. ఇద్దరూ ఇరవై ఓవర్లకు పైగా క్రీజులో నిలబడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడి ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ 50 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పింది. ఈ జోడీని విడదీయడానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బౌలర్లను ఎందరిని మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఫిలాండర్‌, కేశవ్‌ మహారాజ జట్టు స్కోరును ఇప్పటికే 200 దాటించారు. 53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డుప్లెసిస్‌, డికాక్‌లు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ స్కోర్‌ బోర్డును ముందుకు నడిపారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం జోడించారు. క్రీజులో కుదురుకున్న డికాక్‌ (31; 48 బంతుల్లో 7×4)ను అశ్విన్‌ బౌల్‌ చేసి భారత్‌కు ఊరటనిచ్చాడు. భోజన విరామ సమయానికి దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. లంచ్‌ విరామం అనంతరం సేనురాన్‌ ముత్తుసామి (7)ని జడేజా వెనక్కి పంపాడు. అర్ధ సెంచరీ చేసిన డుప్లెసిస్‌ (64) కూడా పెవిలియన్‌ చేరడంతో సఫారీల పని అయిపోయిందనుకున్నారు. కానీ.. ఫిలాండర్‌, కేశవ్‌ మహారాజ జట్టును ఆదుకున్నారు.
అతిగా అభిమానం
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడుతోన్న టీమిండియా బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతుంది. పుణె వేదికగా మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి రోహిత్‌ శర్మ కాళ్లపై పడిపోయాడు. కాళ్లపడి వెళ్లిపోతే బాగానే ఉంటుంది. కానీ, కాళ్ల మీద పడి రోహిత్‌ శర్మను కిందపడేశాడు. ఈ ఘటనపై భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మండిపడ్డాడు. రెండో టెస్టు రెండో సెషన్‌లో టీమిండియా ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ కాళ్లను భద్రత వలయాన్ని దాటుకుని మైదానంలోకి ప్రవేశించిన అభిమాని ముద్దాడాడు. కంగారుపడిన రోహిత్‌ శర్మ తన కాళ్లని వెనక్కి తీసుకునే ప్రయత్నంలో బ్యాలెన్స్‌ కోల్పోయి అభిమానిపై పడిపోయాడు. ఆ సమయంలో మ్యాచ్‌ కామెంటేటర్‌గా ఉన్న సునీల్‌ గవాస్కర్‌.. సెక్యూరిటీ సిబ్బందిపై సీరియస్‌ అయ్యాడు. మ్యాచ్‌ ఫ్రీగా చూద్దామని వచ్చారా.. పని పచేయడానికి వచ్చారా అని మండిపడ్డాడు. ఆదివారం విశాఖపట్నం వేదికగా ముగిసిన తొలి టెస్టులో, అంతకముందు మొహాలిలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ ఇలానే అభిమానులు మైదానంలోకి వచ్చి మ్యాచ్‌కి అంతరాయం కలిగించారు.

DO YOU LIKE THIS ARTICLE?