తలో 25 లక్షలు
ముంబయి : కరోనా వైరస్‌పై పోరాడేందుకు తాము సైతం ఉన్నామంటూ క్రీడాకారులు, సినీ స్టార్స్ ఇలా అంతా నడుంబిగించారు. ఈ క్రమంలోనే ఎవరికి తోచింది వారు విరాళాలుగా ప్రకటిస్తున్నారు. శుక్రవారం క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన వంత సాయాన్ని ప్రకటించాడు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి రూ. 50 లక్షలను సచిన్ ఇచ్చాడు. ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.25లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షల చొప్పున సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు పలు విధాలుగా సాయం చేయడానికి ముందుకొచ్చారు. కొంతమంది తమ నెలసరి జీతాలను విరాళాలుగా ప్రకటించగా, మరి కొంతమంది మెడికల్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చి ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు.