సంజు శాంసన్‌ డబుల్‌ సెంచరీ

కేరళ: సంజూ శాంసన్‌.. ఐపిఎల్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. తాజాగా కేరళ జట్టు తరపున ఈ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్మెన్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. గోవాతో జరిగిన తాజా మ్యాచ్‌ లో డబుల్‌ సెంచరీ బాదాడు సంజూ శాంసన్‌. 129 బంతుల్లో 212 పరుగులు సాధించాడు. లిస్ట్‌-ఏ కెరీర్‌ 50 ఫార్మాట్‌ లో ఒక ఇన్నింగ్స్‌ లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌ కీపర్‌ గా చరిత్ర సృష్టించాడు సంజూ శాంసన్‌. పాకిస్థాన్‌ కు చెందిన అబిద్‌ అలీ గతంలో 208 పరుగులు సాధించాడు. ఆ రికార్డును సంజూ శాంసన్‌ చెరిపేశాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌ గా కూడా సంజూ శాంసన్‌ రికార్డును లిఖించాడు. సంజూ శాంసన్‌ ఇన్నింగ్స్‌ లో 20 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ తో కేరళ 3 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ లో సచిన్‌ బేబీ కూడా రాణించాడు. 135 బంతుల్లో 127 పరుగులు చేశాడు బేబీ.

DO YOU LIKE THIS ARTICLE?