-ప్రధానిగా కొనసాగకూడదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కొలంబో: శ్రీలంక ప్రధాన మంత్రి మహిందా రాజపక్సేకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానిగా రాజపక్సే, ఆయన మంత్రులు విధులు నిర్వహించకూడదని సోమవారం అక్కడి కోర్టు మధ్యంతర ఆదేశాల ను జారీ చేసింది. రాజపక్సే ప్రభుత్వం కొనసాగింపుకు వ్యతిరేకంగా యూఎన్‌పి,జెవిపి,తమిళ్ నేషనల్ అలయెన్స్ పార్టీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మూడు పార్టీలకు చెందిన 122 మంది ఎంపిలు రాజపక్సే ప్రధానిగా కొనసాగడాన్ని నిలుపుదల చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఎంపిల పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం రాజపక్సే ప్రభుత్వం విధులు నిర్వహించకుండా తీర్పును వెలువరించింది.
శ్రీలంక ప్రధాని రాజపక్సేకు మరోసారి భంగపాటు
RELATED ARTICLES