సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై
ఓడించిన తొలి ఆసియా జట్టుగా రికార్డు
పోర్ట్ ఎలిజబెత్: శ్రీలంక క్రికెట్ జట్టు నయా చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన లంకేయులు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. తొలి టెస్టులో కుశాల్‌పెరీరా అసాధరణ బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఆమ్యాచ్ను శ్రీలంక ఒక వికెట్ తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా రెండో టెస్టులోనూ శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితంగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా శ్రీలంక రికార్డు నెలకొల్పింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఒషాడో ఫెర్నాండ్(75 నాటౌట్; 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్(84 నాటౌట్; 110 బంతుల్లో 13 ఫోర్లు) అద్భుతమైన అజేయ అర్ధ శతకాలతో లంక విజయంలో ముఖ్య భూమిక పోషించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా నాలుగో ఇన్నింగ్స్‌లో శ్రీలంకకు ఇది మూడో అత్యుత్తమ భాగస్వామ్యం. శనివారం 60/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన శ్రీలంక మరో వికెట్ కోల్పోకుండా జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో రాణించిన కుశాల్ మెండీస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, తొలి టెస్టులో చారిత్రక విజయాన్ని అందించిన కుశాల్ పెరీరాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
శ్రీలంక నయా చరిత్ర
RELATED ARTICLES