HomeNewsAndhra pradeshశ్రీనివాస్ రెడ్డి ఉరి శిక్ష

శ్రీనివాస్ రెడ్డి ఉరి శిక్ష

హజీపూర్ మైనర్ బాలికల అత్యాచారం, హత్యల కేసులో నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు.

యాదాద్రి జిల్లా బొమ్మారామారం మండలం హజీపూర్ వరుస హత్యల కేసులో వెలువడిన తుది తీర్పు.

నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని మూడు కేసుల్లో దోషి గా నిర్దారించిన కోర్టు.

ఉరి శిక్ష, యావజ్జీవ, కఠిన కారాగార శిక్ష లు ఖరారు..

తీర్పు వెల్లడించిన నల్గొండ ప్రత్యేక పొక్సో న్యాయస్థానం.

నల్లగొండ : తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన హాజీపూర్ మైనర్ బాలికల వరుస హత్యల కేసులో గురువారం తుది తీర్పు వెలువడింది.తీవ్ర ఉత్కంఠ నడుమ ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన విచారణ ముగియడంతో నిందితుడు సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి కి ఉరి శిక్ష ఖరారు అయ్యింది..ఇటీవలే సమత హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష పడటం…అదేవిధంగా నిర్భయ కేసులో ఉరిశిక్ష ఖరారు కావడంతో ఈకేసుపై ఆది నుంచి సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే జనవరి 27నే హజీపూర్ కేసులో తీర్పు రావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడగా నల్గొండ పొక్సో కోర్ట్ సోమవారం తుది తీర్పు వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజిపూర్ గ్రామానికి చెందిన సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి.. లిఫ్ట్ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలను బైక్‌పై ఎక్కించుకొని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం,ఆపై హత్య చేసి బావిలో పూడ్చిపెట్టాడు.అలా ఇప్పటివరకు శ్రావణి, మనీషా, కల్పన లను చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.గతఏడాది ఏప్రిల్ 25వతేదిన హాజిపూర్ గ్రామానికి చెందిన శ్రావణి కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కదిలారు… 26వ తేదిన కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావి వద్ద ఆ బాలికకు చెందిన స్కూల్ బ్యాగ్ ను గ్రామస్ధులు గుర్తించారు…. దీంతో శ్రీనివాస్ రెడ్డి దారుణాలు వెలుగులోకి వచ్చాయి… ఆ తరువాత పోలీసులు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు..విచారణలో గతంలో కూడా మిస్సయిన అదే గ్రామానికి చెందిన మనీషా, తోపాటు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పన ను కూడా ఇదే తరహాలో అత్యాచారం చేసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు… అతనిచ్చిన సమాచారంతోనే బావిలో తవ్వకాలు జరిపి ఆ ఇద్దరు బాలికల అస్దికలు కూడా స్వాదీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యంత క్రూరంగా అత్యాచారానికి ఒడిగట్టి, వారిని చంపి పాడుబడ్డ బావిలో పూడ్చిపెట్టిన సైకో కిల్లర్‌ మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని, ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఆ గ్రామస్తులు ఆందోళనలు కూడా చేపట్టారు… వివిధ పార్టీలు, మహిళా, ప్రజాసంఘాలు కూడా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టాయి. తదననుగుణంగానే ఈ కేసును తీవ్రంగా పరిగణించింది రాష్ట్ర ప్రభుత్వం..ఈ కేసును విచారించేందుకు మృతులు ముగ్గురు మైనర్ బాలికలే కావడంతో కేసు విచారణ నిమిత్తం నల్గొండలో ప్రత్యేకంగా ఫోక్సో కోర్టును ఏర్పాటు చేసింది… జులై 31 నుంచి ప్రత్యేక ఫోక్సో కోర్టులో విచారణ ప్రారంభమైంది… ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది కె.చంద్రశేఖర్ ను ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించింది…. ముగ్గురు బాలికల హత్య కేసులనూ దశల వారీగా విచారించిన న్యాయస్థానం.. ఆకేసులో అన్ని కోణాలనూ పరిశీలించింది. కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ తో పాటు సైంటిఫిక్,సాంకేతిక ఆధారాలను కూడా సేకరించిన పోలీసులు వాటిని సాక్ష్యాధారాల కింద పొక్సో కోర్టుకు అందచేశారు….. ముగ్గురు బాలికలకు సంబంధించి వేరువేరుగా కేసులు నమోదవడంతో విచారణ కూడా వేరువేరుగానే నిర్వహించారు… మూడు కేసులలో కలిపి మొత్తం 101 మంది సాక్ష్యులను కూడా విచారించిన కోర్టు వారి సాక్ష్యాలను కూడా నమోదుచేసింది… ఆతరువాత నమోదైన సాక్ష్యాల పై సెక్షన్ 113కింద నిందితుని అభిప్రాయాన్ని కూడా కోర్టు తీసుకుంది… దీని తర్వాత ఇరు పక్షాల వాదనలు కూడా పూర్తవడంతో పాటు కోర్ట్ లో నేరం నిరూపణ అయ్యింది. దీంతో నల్గొండ పొక్సో కోర్ట్ నెరస్థునికి ఉరి శిక్ష విదించింది. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన ఈ కేసుపై అందరి ద్రుష్టి నెలకొంది…నిర్భయ కేసు లో నిందితులకు ఉరిశిక్ష, అదేవిధంగా ఇటీవలే ఆదిలాబాద్ జిల్లాలో హత్యాచారానికి గైరైన సమత హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష పడటంతో… ఈకేసులో తీర్పుపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది….నిందితుడు శ్రీనివాస్ రెడ్డి దారుణమైన నేరం చేసినట్టు గా నిరూపణ కావడంతో నిందితుడికి కోర్ట్ ఉరిశిక్ష విధించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావ్రుతం కాకుండా ఉండాలంటే నేరస్ధులు పై కోర్ట్ కు వెళ్లకుండా కఠిన శిక్షలు వెంటనే అమలయ్యేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి..

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments