రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం 32 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి వసుంధర రాజె మీద పోటీకి కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. బిజెపి మాజీ నేత జశ్వంత్ సింగ్ తనయుడు మానవేంద్ర సింగ్ను రాజె నియోజకవర్గమైన ఝల్రాపఠాన్ స్థానం నుంచి పోటీకి దింపింది. ప్రస్తుతం ఆయన బార్మేడ్ జిల్లాలోని షియో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత నెల ఆయన కాంగ్రెస్లో చేరారు. 2014లో బార్మేడ్ స్థానం నుంచి జశ్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు తీసుకున్న నిర్ణయంతోనే బిజెపితో ఆయనకున్న నాలుగు దశాబ్దాల బంధం ముగిసిపోయింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాజస్థాన్ ఇన్ఛార్జ్ ముకుల్ వాస్నిక్ రెండో జాబితాను విడుదల చేశారు. గురువారం రాత్రి 152 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. దానిలో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆశిస్తోన్న అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ స్థానాలను ఖరారు చేసింది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ గెహ్లాట్ సర్దార్ పుర నుంచి పోటీ చేస్తుండగా, పైలట్ టోంక్ నుంచి బరిలో దిగుతున్నారు. బిజెపి ఇప్పటికే మూడు జాబితాల్లో 200 స్థానాలకుగానూ 170 మంది అభ్యర్థులను ప్రకటించింది. 2003 నుంచి ఝల్రాపఠాన్ స్థానం నుంచే వసుంధర రాజే పోటీ చేస్తున్నారు. డిసెంబరు 7న ఆ రాష్ట్ర ఎన్నికలు జరగనుండగా, డిసెంబరు 11న ఫలితాలు విడుదలకానున్నాయి.
వసుంధర వర్సెస్ మానవేంద్ర
RELATED ARTICLES