బ్యాంకాక్: 2018 విశ్వ సుందరి పోటీల్లో ఫిలిప్పీన్స్ చెందిన క్యాట్రియోనా ఎలీసా గ్రే విజేతగా నిలిచారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తమారిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనిజువెలాకు చెందిన స్టిఫెనీ గ్యూటెరెజ్ నిలిచారు. భారత్‌కు చెందిన నేహల్ చూడాసమా టాప్ 20లోనూ స్థానం దక్కించుకోలేకపోయారు. 2017లో విశ్వసుందరి కిరీటం అందుకున్న దక్షిణాఫ్రికా భామ డెమీ లీ నెల్పీటర్స్ తన కిరీటాన్ని క్యాట్రియోనాకు పెట్టారు. ఈ పోటీ ఆఖరి రౌండ్లో న్యాయనిర్ణేతలు..‘జీవితంలో మీరు నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఏమిటి?’ అని క్యాట్రియోనాను అడిగారు. ఇందుకు ఆమె సమాధానమిస్తూ ‘మనీలాలోని మురికివాడల ప్రాంతాలకు వెళుతూ అక్కడివారికి నాకు తోచిన సాయం చేస్తుంటాను. అక్కడ నివసించే వారి జీవితాలు నరకంగా ఉంటాయి. అలాంటి విషయాల్లోనే నేను అందాన్ని వెతుక్కుంటాను. అక్కడ నివసించే పిల్లల్లో ఆ అందం, ఆనందం కనిపిస్తాయి. ఈ మిస్ యూనివర్స్ పోటీల ద్వారా మనీలాలోని మురికివాడల్లో నివసిస్తున్న వారి జీవితాలను బాగుచేయాలని అనుకుంటున్నాను. అక్కడి పిల్లలకు చదువు చెప్పాలనుకుంటున్నాను’ అని చెప్పి న్యాయనిర్ణేతల మెప్పు పొందారు.
విశ్వసుందరిగా ఫిలిప్పీన్స్ భామ
RELATED ARTICLES