న్యూఢిల్లీ : భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోసారి విరాట్ కోహ్లీపై సైటర్లు విసిరాడు. గత కొన్ని రోజులుగా కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు చేసిన గంభీర్ తాజాగా మరోసారి కోహ్లీని విమర్శిస్తూ ట్విట్ చేశాడు. క్రికెట్‌కు శాశ్వతంగా గుడ్‌బై పలికిన గంభీర్ ఇప్పుడిప్పుడే రాజకీయంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు క్రీడలు.. ఇలా ఏ రంగమైనా.. తనదైన శైలిలో విమర్శలు చేస్తూ హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలుస్తుంటాడు. గతంలో ధోనిపై కూడా ఇలానే వరుస విమర్శలు చేశాడు. ఇప్పుడు కోహ్లీని లక్ష్యంగా చేసుకొని వరుసగా విమర్శలు గుప్పిస్తున్నాడు. కొన్ని రోజుల క్రీతమే గంభీర్ కోహ్లీను టార్గెట్ చేస్తూ .. నువ్వు ఆర్‌సిబికి ఒక్క ట్రోఫీను అందించకపోయినా ఆర్‌సిబి యాజమాన్యం నిన్ను కెప్టెన్‌గా కొనసాగించడం గోప్ప విషయమని చెప్పాడు. నువ్వు గొప్ప బ్యాట్స్‌మన్ కావచ్చు కానీ గొప్ప కెప్టెన్ మాత్రం కాదని తాజాగా కోహ్లీపై విమర్శలు చేశాడు. ఓటములపై బౌలర్లను నిందించడం సరికాదని, ఆ బాధ్యత మొత్తం కెప్టెన్‌దేనని గంభీర్ అన్నాడు. ఈ సీజన్ ఐపిఎల్‌లో ప్రత్యర్థి జట్ల కెప్టెన్‌లు తమ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందిస్తుంటే మరోవైపు కోహ్లీ మాత్రం ఇప్పటీవరకు ఆర్‌సిబికు బోణీ కూడా చేయించలేక పోయాడని పేర్కొన్నాడు. కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్మన్ కావచ్చు.. కానీ అత్యుత్తమ కెప్టెన్ మాత్రం కాదని, తన పేలవమైన నాయకత్వంతో ఆర్‌సిబి యాజమాన్యంతో పాటు అభిమానులను నిరాశ పరుస్తున్నాడని కోహ్లీపై ఘాటుగా విమర్శలు చేశాడు. అయితే గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన కోహ్లీ.. ‘బయట వాళ్లలా నేను ఆలోచిస్తే.. నేను కూడా ఇంట్లోనే కూర్చునేవాడిని’ అంటూ జావాబు ఇచ్చాడు. ఆట ఆన్నప్పుడు గెలుపు ఓటములు సహజమని దానిని తీసుకొని ఒకరిపై విమర్శలు చేయడం సరికాదనేనాడు. ఇంట్లో కూర్చొని ఎదోఒకటి చెప్పడం సులభమని, అలాంటి వారికి తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరంలేదని కోహ్లీ పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లిపై గంభీర్ సెటైర్లు
RELATED ARTICLES