HomeNewsBreaking Newsవిద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎఐఎస్‌ఎఫ్‌ కలెక్టరేట్‌ ముట్టడి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎఐఎస్‌ఎఫ్‌ కలెక్టరేట్‌ ముట్టడి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి
ప్రజాపక్షం ప్రతినిధి / నిజామాబాద్‌
విద్యార్థుల చదువులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని, పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి, సంక్షేమ హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచాలని ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అద్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, టిఆర్‌ఎస్‌ సర్కార్‌కు ఓట్లు, సీట్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమంపై లేదని ఆరోపించారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి 200 కోట్లు నిధులు విడుదల చేయాలని, విద్యార్థులకు ఆర్‌టిసి బస్‌ పాస్‌ చార్జీలు తగ్గించాలనాన్రు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. బుధవారం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్‌ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కారం పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, గత రెండు సంవత్సరాలకు సంబంధించి దాదాపు రూ. 3500 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు పెండింగ్‌ ఉండడం వల్ల విద్యా సంవత్సరం పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్తే ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ రాలేదని, ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. దీని వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాల్సిన అవసరముందని,వాటిని వెంటనే పెంచాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు లేవని, కోటగల్లి బాలికల పాఠశాల శిథిలావస్థలో ఉందని, కొత్త భవనాన్ని వెంటనే నిర్మించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీచేయాలని మణికంఠరెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తుందని, యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిస్కరించాలని, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీచేయాలన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు పట్టణాలకు చదువుల కోసం ప్రయాణించే ఆర్‌టిసి బస్‌లలో భారీగా పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలన్నారు. 2018 ఎన్నికల హామీ అయిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు ఇప్పటికీ నోచుకోలేదన్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడికి అడ్డూఅదుపు లేదని శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలకు రాస్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ వత్తాసు పలుకుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, డిఇఒ, టీచర్‌, ఎంఇఒ, వార్డెన్‌ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాప్రమాణాలు పెరగడంలేదని, వెంటనే భర్తీచేయాలని కోరారు. అద్దె భవనంలో ఉన్న గురుకుల, మోడల్‌ కస్తూర్బాగాంధీ పాఠశాలలకు సొంతభవనాలు నిర్మించాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ విద్యాశాఖపై ఏనాడూ సమీక్ష చేసిన దాఖలాలు లేవని, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలు ఫీ దోపిడీకి పాల్పడుతున్నాయని, డొనేషన్ల పేరుతో సీట్లు అమ్ముకుంటూ లక్షల రూపాయల ఫీజులు పెంచి పేద, మధ్యతరగతి వారికి విద్య దూరం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాస్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మిలిటెంట్‌ పోరాటాలు నిర్వహిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు అంజలి, నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, నందు శ్రీ, సహాయ కార్యదర్శులు కుశాల్‌, అరుణ్‌ తదితరులు పాల్గొన్నా

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments