మెరుగుపడనున్న బ్రాడ్‌బ్యాండ్ సేవలు
బెంగళూరు: బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ఊతం ఇచ్చే భారత అత్యంత బరువైన ఉపగ్రహం జిశాట్-11ను బుధవారం తెల్లవారుజామున ఫ్రెంచి గయానా నుంచి ఏరియన్‌స్పేస్ రాకెట్ ద్వారా ప్రయోగించినట్లు భారత రోదసి పరిశోధన సంస్థ(ఇస్రో) తెలిపింది. కౌరౌలోని ఏరియన్ లాంచ్ కాంప్లెక్స్ నుంచి భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 2.07 గంటలకు ప్రయోగించారు. ఏరియన్-5 వాహకం జిశాట్-11ను నింగిలో కి ఎగిసిన దాదాపు 33 నిమిషాలకు కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని దూర్‌దర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ‘…భారత్ మునుపెన్నడు నిర్మించని అత్యంత పెద్దది, బరువైన, శక్తివంతమైన ఉపగ్రహాన్ని బుధవారం ఏరియన్-5 ద్వారా విజయవంతంగా ప్ర యోగించింది’ అని ఇస్రో చైర్మన్ కె శివన్ ప్రయోగం ముగిసిన వెంటనే చెప్పారు. భారత్‌కు జిశాట్-11 ‘రోదసి సంపన్న ఆస్తి’ కాగలదన్నారు. ఈ ఉపగ్రహానికి 38 స్పాట్ బీమ్స్, ఎనిమిది సబ్ బీమ్స్ ఉన్నాయని, ఇది మా రుమూల ప్రాంతాలు సహా యావత్ దేశాన్ని కవర్ చే స్తుందని, దేశానికి 16జిబిపిఎస్ డేటా లింక్ సేవలు వం టివి అందిస్తుందని వివరించారు. ఇస్రో నిర్మించిన జిశాట్-11 అత్యంత బరువైనది. దీని బరువు దాదాపు 5,854 కిలోలు. ఇది తరువాతి తరం ‘అధిక నిర్గమాం శ’ కమ్యూనికేషన్ ఉపగ్రహం. 15 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం మనగలిగేలా ఇస్రోకు చెందిన ఐ-6కె బస్ కాన్ఫిగరేషన్‌తో దీనిని రూ పొందించారు. ఈ ఉపగ్రహాన్ని మొదట భూ సమకాలిక బదిలీ కక్ష్యలో పెడతా రు, తర్వాత భూస్థిర కక్ష్య(భూమధ్య రేఖకు 36,000 కిమీ. పైకి)లోకి ఎత్తుతారు. అన్ని కక్ష్యల పరీక్షలు పూర్తయ్యాక ఈ ఉపగ్రహం పనిచేయడం ఆరంభిస్తుంది. కె యు-బ్యాండ్‌లోని 32 యూ జర్ బీమ్స్, కెఎ-బ్యాండ్‌లోని 8 హబ్ బీమ్స్ ద్వారా భారత భూభాగం, ద్వీపాల వినియోగదారులకు ఈ జిశాట్-11 ఉపగ్రహం అధిక డేటా రేటు కనెక్టివిటీని అందిస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ సేవల విషయంలో జిశాట్-11 కీలక పాత్ర పోషించనున్నది. ఏరియన్-5 వాహకం(ఫ్లయిట్ విఎ 246) జిశాట్-11తోపాటు కొరియా ఏరోస్పేస్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన జియో-కొమ్‌ప్ శాట్-2ఎను కూడా ప్రయోగించింది. జియో-కొంప్‌శాట్-2ఎ బరువు 3,507.20 కిలోలు. ఇది వాతావరణం, రోదసి వాతావరణం పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా రూపొందించారు.