HomeNewsBreaking Newsలోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సమైక్య వ్యూహం అవసరంనితీశ్‌ ముఖాముఖీ సమావేశం

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సమైక్య వ్యూహం అవసరంనితీశ్‌ ముఖాముఖీ సమావేశం

బిజెపిని ‘జీరో’ స్థాయికి దిగజార్చాలి
బీహార్‌లో అఖిలపక్ష సమావేశానికి మమత ప్రతిపాదన
కోల్‌కత:
ప్రతిపక్షాలన్నీ ఒక్కచోట చేరి సమై క్య వ్యూహంతో మెలగాల్సిన అవసరం ఉం దని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వారిద్దరూ సోమవారం ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. బిజెపిని ‘జీరో’ స్థాయికి దిగజార్చాలని, బీహార్‌లోనే ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా ఒక సమావేశం నిర్వహించి ఎలా ముందడుగు వేయా లో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. “వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలమధ్య సమైక్యతతో విస్తారమైన ఏకాభిప్రాయ ప్రాతిపదికపై ఒక కూటమిని ఏ విధంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది? ఈ విషయలో ఐక్యత సాధించే దిశగా ముందుకు వెళ్ళేందుకు సానుకూల ఫలితాలు సాధించేందుకు ఏ విధమైన పద్ధతులు అనుసరించాలి?” వంటి విషయాలు ప్రధానంగా వీరిద్దరిమధ్యచర్చల్లో చోటు చేసుకున్నాయి. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకుగాను ప్రతిపక్షాలకు ఒక సమైక్య వ్యూహం అవసరమని, పార్టీలన్నీ సమైక్యంగా ఈ వ్యూహం రూపొందించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ సోమవారం ముఖాముఖీ సమావేశం జరిపారు. ఈ సమావేశంలో బీహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం చాల సానుకూలమైన వాతావరణంలో జరిగిందని తేజస్వి యాదవ్‌ సమావేశం అనంతరం చెప్పారు. “చాలా సానుకూలమైన దృక్పథంతో ముఖ్యమంత్రులు ఇరువురూ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు, ఈ సమావేశం ద్వారా చాలా మంచి వాతావరణం ఏర్పడింది, ఇక ప్రతిపక్షాలన్నీ ఒక సమైక్య వ్యూహంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది” అని నితీశ్‌ కుమార్‌ సమావేశం అనంతరం చెప్పారు. “కేంద్రంలో అధికారపార్టీ దేశ అభివృద్ధికోసం చేసింది ఏమీలేదు, అధికార పార్టీ కేవలం ప్రకటనలు ఇచ్చుకోవడంపైనే ఎక్కువ మోజు చూపిస్తోంది” అని నితీశ్‌ కుమార్‌ విమర్శించారు. “నేను నితీశ్‌ కుమార్‌కు ఒకేఒక్క విజ్ఞప్తి చేశాను, జయప్రకాశ్‌ నారాయణ్‌ జీ భూదానోద్యమం బీహార్‌ నుండే ప్రారంభమైంది, మనం గనుక బీహార్‌లోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మనం ఆ స్ఫూర్తితో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయంపై ఒక నిర్ణయం తీసుకోవచ్చు” అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. “బిజెపిని శూన్యస్థానానికి దిగజార్చాలన్నదే నా కోరిక. మీడియా మద్దతు వారి అబద్ధాల అండతో బిజెపి ఇప్పుడు పెద్ద హీరోగా అనుకుంటున్నది” అని మమత విమర్శించారు.ప్రతిపక్షాల ఐక్యత విషయంలో కాంగ్రెస్‌పార్టీ భాగస్వామ్యం గురించి పాత్రికేయులు ప్రశ్నించగా, “అన్ని పార్టీలూ భాగస్వామ్యులుగా ఉంటాయి” అని మమత అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుదలపై ఈ ఇద్దరు నాయకులు తీవ్ర విమర్శ చేశారు. రూపాయి విలువ క్షీణస్థాయకి దిగజారిపోయిందని, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అదేవిధంగా ప్రభుత్వం తన గొప్పలు చెప్పుకోవడానికి ప్రకటనల ఖర్చు కూడా భారీగా పెంచేసిందని ఆమె విమర్శించారు. మమతాబెనర్జీ గతనెలలో ఇదేవిధంగా సమాజ్‌వాదీపార్టీ నాయకులు అఖిలేశ్‌ యాదవ్‌తో కూడా సమావేశం నిర్వహించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో కూడా సమావేశం జరిపారు. ఇదిలా ఉండగా, కేంద్రలోని అధికార బిజెపి మాత్రం నితీశ్‌ మధ్య సమావేశాన్ని ఒక విఫలయత్నంగా అభివర్ణించింది. ఈ విధమైన అవకాశవాద పొత్తులు ఏ విధమైన ఫలితాలను ఇవ్వలేవని విమర్శించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments