‘లైగర్’ నుంచి ఫస్ట్ సాంగ్రిలీజ్పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగాచేస్తున్న లైగర్ మూవీ ఫస్ట్‌లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ‘అక్డి పక్డి’లో విజయ్ డ్యాన్స్ అదరగొట్టారు.లైగర్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ కానివ్వండి, లేదా యాక్షన్ కానివ్వండి. బాక్సింగ్ ట్రైనింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఈ రౌడీ హీరో పెట్టిన ఎఫర్ట్నిజంగా ఎంతో అభినందనీయం. రెండున్నరేళ్లుగా ఈ సినిమా కోసం విజయ్ ప్రాణం పెట్టాడు.అందులో భాగంగానే విజయ్ ఇప్పుడు ఒక అదిరిపోయే మాస్ సాంగ్ తో రాబోతున్నాడు. నిన్న రిలీజైన ‘అక్డి పక్డి’ అనే ప్రోమో సాంగ్‌లో విజయ్ ఇప్పటివరకు చేయనంతగా డాన్సులు మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. అది జనాలను బాగా ఆకర్షిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ 8 మిలియన్స్ దాటి 10 మిలియన్ వైపు దూసుకుపోతుంది. ఆదివారం రిలీజ్ అయ్యే ఫుల్ సాంగ్ ఇండియా వైడ్ షేక్ అవ్వబోతుంది. ఈ సాంగ్‌లో విజయ్ డాన్స్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఆయన సాంగ్ ప్రోమోలో డాన్స్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. 6 ఫీట్స్ ఉన్న ఏ స్టార్ హీరో కూడా డాన్సులు ఎక్కువ చేయలేడు. ఒక్క హృతిక్ రోషన్ తప్ప ఎవరు సరిగా డాన్స్ చేయలేరనేది వాస్తవం. కానీ విజయ్ ఆరు ఫీట్లు ఉన్నప్పటికీ కూడా అలవోకగా మాస్ స్టెప్పులు ఇరగతీస్తూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు. కాగా ఈ మూవీ ఆగష్టు 25న విడుదల కానుంది.
‘లైగర్’ నుంచి ఫస్ట్ సాంగ్ ‘అక్డి పక్డి’
RELATED ARTICLES