లండన్‌లో గాంధీ విగ్రహానికి పోచారం నివాళి

ప్రజాపక్షం/హైదరాబాద్‌: మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా లం డన్‌లోని టావోస్టిక్‌ స్కేర్‌ పార్క్‌లోని గాంధీ విగ్రహానికి తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. బ్రిటన్‌లో ఇండియన్‌ హై కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ నరసింహాచార్యులు, తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సభ్యులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?