పాండ్య, ధవన్‌లకు పిలుపు
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
ముంబయి : న్యూజిలాండ్ గడ్డపై ఘోరంగా విఫలమైన భారత పురుషుల జట్టు.. స్వదేశంలో మరోరసవత్తరపోరుకు సిద్ధమైంది. మార్చి 12 నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. సునీల్ జోషీ నేతృత్వంలోని నూతన సెలెక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. వర్క్‌లోడ్ కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇస్తారని ప్రచారం జరిగినా.. బోర్డు మాత్రం అతన్ని కొనసాగించింది. ఇక గాయాలతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఓపెనర్ శిఖర్ ధావన్, బౌలర్ భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ముగ్గురు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్‌పై శిక్షణను తీసుకున్న విషయం తెలిసిందే. ఇక పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్ధిక్ పాండ్యా.. దేశవాళీ టోర్నీ డివై పాటిల్ టీ20 కప్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. భువనేశ్వర్, ధావన్ కూడా ఆడినా.. అంతగా రాణించలేకపోయారు. ఇక న్యూజిలా్‌ండ పర్యటనలో గాయపడ్డ పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అవకాశం దక్కలేదు. పృథ్వీషా, రిషభ్ పంత్, శుభ్ మన్ గిల్‌కు మరోసారి అవకాశం ఇవ్వగా.. కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్చా జోడీ, నవ్‌దీప్ సైనీ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
భారత జట్టు..
శిఖర్ ధావన్, పృథ్వీషా, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, మనీష్, అయ్యర్, రిషభ్ పంత్, హర్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్
రోహిత్‌కు రెస్ట్
RELATED ARTICLES