లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించొద్దు..
కఠిన శిక్షలు తప్పవు
మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
హైదరాబాద్ : దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దాని నిర్ములనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం
లాక్డౌన్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిందని, ఈ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారిని కఠిన శిక్షలు తప్పవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. వైరస్ వారైనా పడకుండా మేము తీసుకునే చర్యలకు తూట్లుపొడుస్తే ఉపేక్షించేది లేదని, సహకరించకుంటే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్(కనిపిస్తే కాల్చివేత) ఆదేశాలు జారీ చేయవలసి వస్తుందని అయన హెచ్చరించారు. పోలీసులకు సహకరించకుండటే.. ఆర్మీని రంగంలోకి దించే పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అగ్రరాజ్యమైన అమెరికాలో స్థానిక పోలీసులు కంట్రోల్ చేయలేక ఆర్మీని పిలిపించారని, రాష్ట్రంలో ప్రజలు సహకరించకపోతే 24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఒకరి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారంతా కోలుకుంటున్నారు. వారంతా ఏప్రిల్ 7 కల్లా డిశ్చార్జ్ అవుతారు. రాష్ట్రంలో 114 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. షూట్ ఎట్సైట్ ఆర్డర్స్ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలలని ఆయన సూచించారు.
రోడ్లపై కనిపిస్తే కాల్చివేస్తాం
RELATED ARTICLES