ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని సిర్పి బజార్ ప్రాంతం శివ్‌పురి రోడ్డుపై వేగంగా వస్తున్న ట్రక్కును ట్రాక్టర్ ఢీకొని ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగిందని, ఐదుగురు దుర్మరణం చెందగా మరో ఆరుగురు గాయపడ్డారని ఎఎస్‌పి దేవేశ్ పాండే చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన తెలిపారు. మృతులను కరణ్‌సింగ్ (35), హరిసింగ్(45), పర్మానంద్ (65), గయాదీన్ (60), మేవాలాల్ (60) గుర్తించినట్లు వెల్లడించారు. వీరంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి
RELATED ARTICLES