కేంద్రం బేషరతుగా వాటిని రద్దు చేయాలి
విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల డిమాండ్
హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో 26న భారీ ప్రదర్శన
ఫిబ్రవరి మొదటి, రెండవ వారంలో ‘రైతుయాత్ర’
ప్రజాపక్షం / హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బేషరతుగా నూత న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. అఖిలభారత రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఈ నెల 26న హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేం ద్రాల్లో ట్రాక్టర్లు, ద్విచక్ర, ఇతర వాహనాలతో భారీ ప్రదర్శనను నిర్వహించాలని తీర్మానించా యి. ఫిబ్రవరి మొదటి, రెండవ వారంలో ‘రైతుయాత్ర’ను నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఢిల్లీ రైతులకు సంఘీభావంగా ఈనెల 26న రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలపై హైదరాబాద్, బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిజెపి మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీ య పార్టీలను ఆహ్వానించగా వామపక్షాలు, కాంగ్రెస్, టిజెఎస్, టిడిపి నేతలు హాజరు కాగా, టిఆర్‌ఎస్ నేతలు హజరు కాలేదు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షత వహించగా అఖిల భారత రైతు సం ఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పశ్యపద్మ, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు డి.జి.నరసింహారావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి, టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్‌ఎం.కోదండరామ్, నాయకులు పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, సిపిఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్‌రావు, అచ్యుత రామరావు, సిపిఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ,అనురాధ, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, సిపిఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) రాష్ట్ర నాయకులు ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. భూసేకరణ చట్టానికి విరుద్ధంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం భూసేకరణ పేరుతో రైతులను రోడ్డుపైకి తీసుకొస్తున్నదని వారు విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని ప్రకటించిన సిఎం కెసిఆర్, ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత యుటర్న్ తీసుకున్నారని, అందుకే కొనుగోలు కేంద్రాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించారని విమర్శి ంచారు. రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయాల్సిన బాధ్యత టిఆర్‌ఎస్ ప్రభుత్వంపైనే ఉన్నదని, కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వెంటనే ప్రత్యేక శాసనసభ సమావేశాలను నిర్వహించి తీర్మానం చేయాలని, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే కుట్ర : చాడ వెంకట్‌రెడ్డి
వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేయాలనే కుట్ర జరుగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను రద్దు చేయడమంటే రైతులను బజారున పడేయడమేనని పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్‌బంద్‌లో పాల్గొన్న టిఆర్‌ఎస్.. ఆ తర్వాత సిఎం ఢిల్లీ పర్యటన తర్వాత యుటర్న్ తీసుకున్నారని, ఇప్పటికైనా ఈ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో టిఆర్‌ఎస్ ప్రధానపాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్రంలోని రెవెన్యూ చట్టాల్లో కూడా లొసుగులు ఉన్నాయని, సమగ్ర భూ సర్వే చేపట్టలేదని, నిమ్జ్, ఫార్మా కంపెనీల నిమిత్తం భూసేకరణ చేపట్టి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని, ఆ సమస్యను తానే స్వయంగా వెళ్లి పరిష్కరిస్తానని సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో సమన్వయంగా కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సిపిఐ(ఎం) తమ్మినేని వీరభద్రరావు మాట్లాడుతూ భవిష్యత్‌లో భారీ రైతు ఉద్యమాలు చేస్తామన్నారు. పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీకి కేటాయించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇచ్చేయాలన్నారు. రబీ పంట దగ్గరకు వస్తుందని, కొనుగోలు కేంద్రాలను తీసేస్తామనడం సరైంది కాదన్నారు. పంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు స్పష్టమైన హామీనివ్వాలన్నారు. కొనుగోలు కేంద్రాల రద్దు నిర్ణయాన్ని సిఎం పునరాలోచన చేసుకోవాలని డిమాండ్ చేశారు.
టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ మాట్లాడుతూ రైతు సమస్యలపై అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. భూసేకరణ – 2013 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి, జిఒల ద్వారా భూసేకరణ చేపడుతోందని, నిమ్జ్, ఫార్మాసిటీ పేరుతో రైతుల నుంచి అన్యాయంగా భూసేకరణ చేపడుతోందని ఆరోపించారు. భూసేకరణ అంశంపై పోరాటం చేస్తున్న రైతులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నుంచి కేంద్ర మంత్రివర్గం వరకూ ప్రతి ఒక్కరూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో చేపట్టే రైతు ఉద్యమాలకు కాంగ్రెస్ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. సిపిఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్‌రావు, మాట్లాడుతూ భూ సమస్యలపై సిఎం కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. కెసిఆర్ మాటలు ఉత్తవేనని రుజువైందన్నారు. సిపిఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ మాట్లాడుతూ గిట్టుబాటు ధరలకు ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎం.కోదండరామ్, నాయకులు పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, సిపిఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్‌రావు, అచ్యుత రామరావు, సిపిఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ,అనురాధ, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, సిపిఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) రాష్ట్ర నాయకులు ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. భూసేకరణ చట్టానికి విరుద్ధంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం భూసేకరణ పేరుతో రైతులను రోడ్డుపైకి తీసుకొస్తున్నదని వారు విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని ప్రకటించిన సిఎం కెసిఆర్, ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత యుటర్న్ తీసుకున్నారని, అందుకే కొనుగోలు కేంద్రాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించారని విమర్శి ంచారు. రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయాల్సిన బాధ్యత టిఆర్‌ఎస్ ప్రభుత్వంపైనే ఉన్నదని, కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వెంటనే ప్రత్యేక శాసనసభ సమావేశాలను నిర్వహించి తీర్మానం చేయాలని, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.