ముంబయి : మహారాష్ట్రలో టిఆర్పి రేటింగ్ కుంభకోణాన్ని ముంబయి పోలీసులు బయటపెట్టారు. టిఆర్పిల విషయంలో కొన్ని ఛానెళ్లు మోసాలు చేస్తున్నాయని వెల్లడించారు. కొందరికి డబ్బులు ఇచ్చి వాళ్ల ఛానెళ్లు చూసేలా చేస్తున్నాయని ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ అన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామనీ.. వీరిలో ఒకరు రేటింగ్లను సమీక్షించేందుకే ఏర్పాటు చేసే పీపుల్ మీటర్ల ఏజెన్సీకి చెందిన మాజీ ఉద్యోగిగా గుర్తించినట్టు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఓ ప్రముఖ ఛానల్ సహా మూడు ఛానెళ్లు ఈ టిఆర్పి మోసాలకు పాల్పడుతున్నాయన్న సిపి.. వాటిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆయా ఛానళ్లకు ప్రకటనకర్తల నుంచి వచ్చే నిధులకు సంబంధించి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు తేలితే ఎంతటి వారినైనా విచారిస్తామని స్పష్టంచేశారు. నేరం జరిగినట్టు తేలితే వారి ఖాతాలను సీజ్ చేసి, తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు టిఆర్పిలతో అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా ఆదాయం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్టు పరమ్ వీర్‌సింగ్ వెల్లడించా రు. కాగా, ముంబయి పోలీసుల ప్రకటనను రిపబ్లిక్ టివి ఖండించింది. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతున్నందుకు తమపై కక్ష గట్టారని ఆ ఛానెల్ చీఫ్ అర్నాబ్ గోస్వామి అన్నా రు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసులో పోలీసుల వైఫల్యాలను ప్రశ్నించినందుకే తమపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అరిచి కేకలు పెట్టే అర్ణబ్ గోస్వామి అడ్డం గా బుక్కయ్యారు అర్ణబ్ గోస్వామి. మీడియా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో కూడా అర్ణబ్ గోస్వామిపై వచ్చినన్ని కామెడీ పోస్టులు బహుశా ఎవరి మీదా వచ్చి ఉండవు. దేశంలో సమస్యలు అన్నింటిపై నిలదీస్తాను..నిగ్గదీస్తాను..ప్రశ్నిస్తాను..పరిష్కరిస్తాను అనే ఈ టాప్ జర్నలిస్ట్ కు చెందిన ఛానల్ రిపబ్లిక్ టీవీ ఇప్పుడు టీఆర్ పి రేటింగ్ మోసానికి పాల్పడిననట్లు గుర్తించారు పోలీసులు. ఈ విషయాలను ముంబయ్ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. ముఖ్యంగా అర్ణాబ్ గోస్వామి బాలీవు్డ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం పై ముంబయ్ పోలీసులపై..శివసేన నేతలపై కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున డిబేట్స్ నిర్వహించటంతోపాటు వార్తలు ప్రసారం చేశారు. ఈ తరుణంలో ఛానల్ రేటింగ్ ఫ్రా్డ లో దొరకటం విశేషం. రిపబ్లిక్ టీవీ తోపాటు ముంబయ్ కు చెందిన రెండు లోకల్ ఛానళ్ళు కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. టీఆర్ఎపీ లను పర్యవేక్షించేందుకు ముంబయ్ లోని ఓ ప్రాంతంలో బార్క్ 2000 బారో మీటర్స్ ను ఏర్పాటుచేసింది. ఈ మీటర్లు ఏర్పాటుచేసిన ప్రాంతంలో ప్రజలు ఇళ్లలో లేని సమయంలో కూడా కొన్ని ఛానళ్లు పెట్టి ఉంచాలని కోరి..అందుకు వారికి కొంత మొత్తం చెల్లిస్తూ వస్తున్నారు. ఏ ఇళ్ళలో ఎంత మంది ఏ ఛానల్ చూస్తున్నారనే అంచనా తోనే రేటింగ్స్ నిర్ధారిస్తారనే విషయం తెలిసిందే. ఇలా ఛానళ్ళు పెట్టి ఉంచినందుకు వారికి కొంత నగదు చెల్లించినట్లు పోలీసు కమిషనర్ వెల్లడించారు. ఈ టీఆర్పీ స్కామ్ కు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా..అతని దగ్గర 20 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 8.5 లక్షలు అతని బ్యాంక్ లాకర్ లో గుర్తించారు. మరాఠీ ఛానళ్ళు ఫక్త్ మరాఠి, బాక్స్ సినిమా ప్రతినిధులను అరెస్ట్ చేశారు. బార్క్ తరపున మీటర్లను పర్యవేక్షిస్తున్న హంసా కంపెనీ ఉద్యోగులు కూడా ఈ ఫ్రా్డ లో భాగస్వాము లుగా ఉన్నట్లు గుర్తించారు. బార్క్ నుంచి కూడా పోలీసులు ఆ ఇళ్ళ నుంచి వచ్చే డేటాను తీసుకున్నారు. ముంబయ్ లో జరుగుతున్న విధంగానే ఇతర ప్రాంతాల్లో కూడా జరిగే ఛాన్స్ ఉందని కమిషనర్ వెల్లడించారు. రిపబ్లిక్ టీవీ ప్రమోటర్లు, డైరక్టర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. వారిని విచారిం చటానికి పిలుస్తున్నట్లు తెలిపారు. విచారణ కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా రిపబ్లిక్ టీవీ అధికారులకు నోటీసులు పంపినట్లు తెలిపారు. రేటింగ్స్ కోసం కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయని తెలిపారు. ఈ రేటింగ్స్ స్కామ్ కు సంబంధించిన సమాచారాన్ని ముంబయ్ పోలీసులు ఇన్ఫర్ మేషన్ అ్ండ బ్రా్డ కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు కూడా పంపారు.
రేటింగ్ స్కామ్ బట్టబయలు
RELATED ARTICLES