ప్రజాపక్షం/హైదరాబాద్ నూతన రెవెన్యూ బిల్లు, తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు, పాస్‌బుక్ బిల్లు- విఆర్ఒ రద్దు ,తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు, పంచాయతీరాజ్ 2020 సవరణ బిల్లు, పురపాలక చట్టం 2020 సవర ణ బిల్లులకు శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమో దం తెలిపింది. ఈ నెల 9న సభలో సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లుపై శుక్రవారం సుమారు 4 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం సభ ముజువాణి ఓటుతో రెవెన్యూ బిల్లుతో పాటు మొత్తం నాలుగు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం అనంతరం సిఎం కె.చంద్రశేఖర్‌రావును మంత్రులు, ఎంఎల్ఏలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
రెవెన్యూ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం
RELATED ARTICLES