విజృంభించిన అశ్విన్, రాణించిన ఇషాంత్, బుమ్రా
హెడ్ ఒంటరి పోరాటం
ఆస్ట్రేలియా 191/7, భారత్‌తో తొలి టెస్టు
ఆడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తంగా సాగుతోంది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా బౌలర్లు రాణించగా.. రెండో రోజు ఆటలో భారత బౌలర్ల విజృంభించారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టుపై భారత బౌలర్ల విరుచుకుపడ్డారు. వీరి ధాటికి ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీచంద్ర అశ్విన్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తలో రెండు వికెట్లతో రాణించారు. ఆసీస్ బ్యాట్స్మన్లలో ట్రావిస్ హెడ్ (61 బ్యాటింగ్) ఒక్కడే ఒంటరి పోరాటం చేసి తమ జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు ఆటముగిసే సమయానికి హెడ్‌తో పాటు మిచెల్ స్టార్క్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. బ్యాటింగ్‌లో విఫలమైన భారత జట్టు బౌలింగ్‌లో మాత్రం చెలరేగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 59 పరుగులతో భారత్ తొలి ఇన్నింగ్స్‌కు వెనుకబడి ఉంది. శుక్రవారం 250/9 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా అదే స్కోరు వద్ద ఆలౌటైపోయింది. చివరి వికెట్‌గా మహ్మద్ షమీ (6)ను హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. భారత బ్యాట్స్మన్లలో చతేశ్వర్ పుజారా (123) అసాధరణ ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, నాథన్ లియాన్ చెరో రెండో వికెట్లు దక్కించుకున్నారు.
ఆదిలోనే షాకిచ్చిన ఇషాంత్…
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను ఇషాంత్ శర్మ ఆదిలోనే దెబ్బ తీశాడు. మొదటి ఓవర్ వెసిన ఇషాంత్ మూడో బంతికే విధ్వంసకర బ్యాట్స్‌మన్ అరోన్ ఫించ్ (0)ను ఖాతా తెరువకుండానే క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆస్ట్రేలియా ఒక్క పరుగుకే మొదటి వికెట్ కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ మార్కుస్ హారిస్, ఉస్మాన్ ఖవాజా ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు సమన్వయంతో ఆడుతూ కొద్ది సేపటివరకు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ భారత బౌలర్ల ఓపికాకు పరీక్ష పెట్టారు. అనంతరం రంగంలోకి దిగిన స్పిన్నర్ అశ్విన్ ఆసీస్‌కు మరో షాకిచ్చాడు. కుదురుగా ఆడుతున్న ఓపెనర్ హారిస్ (26; 57 బంతుల్లో 3 ఫోర్లు)ను తెలివైన బంతితో పెవిలియన్ దారి చూపెట్టాడు. దీంతో 44 పరుగుల కీలకమైన రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన సీనియర్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ ఎక్కువసేపు క్రీజులో నిలువలేక పోయాడు. గత కొంతకాలంగా ఫామ్‌లో లేక వరుసగా విఫలమవుతున్న షాన్ మార్ష్‌ను రెండు పరుగుల వద్దే అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ వేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 59 పరుగుల వద్ద మూడో వికెట్ చేజార్చుకుంది. అనంతరం వచ్చిన పీటర్ హాండ్స్కొంబ్తో కలిసి ఖవాజా ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. వీరిద్దరూ కుదురుగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రతయత్నం చేశారు. వీరు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ పిచ్‌పై పాతుకుపోయారు. ఎక్కువగా డాట్ బాల్స్ ఆడుతూ పోవడంతో పరుగుల వేగం గనణీయంగా తగ్గింది. అయితే ఈ సమయంలో అశ్విన్ మరోసారి తన ప్రతాపాన్ని చూపెడుతూ ఆసీస్‌కు పెద్ద షాకిచ్చాడు. సమన్వయంతో ఆడుతున్న ఆసీస్ కీలక బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజాను వికెట్ కీపర్ పంత్ చేత క్యాచ్ పట్టించి పెవిలియన్‌కు పంపాడు. 125 బంతులు ఆడిన ఖవాజా ఒక ఫోర్‌తో 28 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం ట్రావిస్ హెడ్‌తో కలిసి హ్యాండ్స్కొంబ్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కూడా మరో కీలకమైన భాగస్వామ్యాన్ని ఏర్పరిచేందుకు ప్రయత్నించారు. సమన్వయంతో ఆడుతూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ పోయారు. అవకాశం దొరికినప్పుడు చెత్త బంతులను బౌండరీలుగా మరల్చుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా 285 బంతుల్లో 100 పరుగులను పూర్తి చేసుకుంది. ఈ జంటను విడదీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. కానీ, వారికి ఫలితం దక్కలేదు. టి విరామ సమయానికి ఆస్ట్రేలియా 55 ఓవర్లలో 117/4 పరుగులు చేసింది. టి విరామా అనంతరం పుంజుకున్న భారత బౌలర్లు మరోసారి ఆసీస్ బ్యాట్స్మన్లపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఆసీస్ స్కోరు 120 పరుగుల వద్ద కుదురుగా ఆడుతున్న హాండ్స్‌కొంబ్ (34; 93 బంతుల్లో 5 ఫోర్లు)ను బుమ్రా కీపర్చే పల్టీకొట్టించి తన ఖాతాలో తొలి వికెట్ వేసుకున్నాడు. హాండ్కొంబ్ ఔటవడంతో 33 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక పోయాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పైన్ (20 బంతుల్లో 5) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా 127 పరుగులకే కీలకమైన 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. ఈ సమయంలో ఆసీస్ 150-160 పరుగులలోపు ఆలౌటైపోతుందని అందురూ భావించారు. కానీ, హెడ్ అసాధరణ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు ఇతను మాత్రం ధాటిగా ఆడుతూ ఆసీస్ స్కోరుబోర్డును ముందుకు సాగించాడు. కమ్మిన్స్ అండతో ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ.. అవకాశం దొరికినప్పుడు బౌండరీలు కొడతూ పరుగులు సాధించాడు. ఈక్రమంలోనే ఆసీస్ 150 పరుగుల మైలు రాయిని దాటింది. మరోవైపు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న హెడ్ 103 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఆ కొద్ది సేపటికే కమ్మిన్స్‌తో కలిసి ఏడో వికెట్‌కు 101 బంతుల్లో 50 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని పూర్తి చేసి తమ జట్టు పరువును కాపాడాడు. అనంతరం హెడ్‌కు అండగా నిలిచిన కమ్మిన్స్ (47 బంతుల్లో 10)ను బుమ్రా ఎల్బీడబ్ల్యూగా వెనుకకుపంపాడంతో ఆసీస్ 177 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన మిచెల్ స్టార్క్‌తో కలిసి హెడ్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 88 ఓవర్లలో 191/7 పరుగులు చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ (61 బ్యాటింగ్; 149 బంతుల్లో 6 ఫోర్లు) అజేయంగా క్రీజులో నిలిచున్నాడు. ఇతనికి అండగా స్టార్క్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో రవీచంద్ర అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
స్కోరుబోర్డు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 250 ఆలౌట్.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: అరోన్ ఫించ్ (బి) ఇషాంత్ శర్మ 0, మార్కస్ హారిస్ (సి) మురళీ విజయ్ (బి) అశ్విన్ 26, ఉస్మాన్ ఖవాజా (సి) రిషభ్ పంత్ (బి) అశ్విన్ 28, షాన్ మార్ష్ (బి) అశ్విన్ 2, పీటర్ హాండ్స్‌కొంబ్ (సి) రిషభ్ పంత్ (బి) బుమ్రా 34, ట్రావిస్ హెడ్ (బాటింగ్) 61, టిమ్ పైన్ (సి) రిషభ్ పంత్ (బి) ఇషాంత్ శర్మ 5, పాట్ కమ్మిన్స్ (ఎల్బీడబ్ల్యూ) బుమ్రా 10, మిచెల్ మార్ష్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు: 17, మొత్తం (88 ఓవర్లలో) 191/7.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 15 జస్ప్రీత్ బుమ్రా 20 మహ్మద్ షమీ 16 రవీచంద్ర అశ్విన్ 33- మురళీ విజయ్ 4-
రెండో రోజు బౌలర్ల హవా
RELATED ARTICLES