సుప్రీంకోర్టుకు తెలిపిన సిబిఐ చీఫ్ వర్మ
డిసెంబర్ 5న తదుపరి విచారణ
న్యూఢిల్లీ: కేంద్రం పదవీ బాధ్యతల నుంచి తప్పించి సెలవుపై పంపేసిన సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ తనను బదిలీ చేయడానికి వీలులేని విధంగా రెండేళ్లకు నియమించారని సుప్రీంకోర్టుకు గురువారం తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తనపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా కోర్టు వాదప్రతివాదాలపై వినబోమని తెలిపింది. ‘మేము చట్టంకు సంబంధించిన అంశాన్నే పరీక్షిస్తున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వర్మ తరఫున న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ వాదిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు. తన క్లయింటును చట్టప్రకారం కనీసం బదిలీ చేయడానికి కూడా వీలులేదన్నారు. రెండేళ్ల వరకు ఆయన పదవిలోనే ఉండేలా నియమించారన్నారు. సెలవుపై వర్మను పంపించేసేలా ఉత్తర్వును జారీచేసే అధికారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదని న్యాయమూర్తులు ఎస్ కౌల్, కెఎం జోసెఫ్ కూడిన ధర్మాసనం ముందు నారిమన్ వాదించారు. ఈ సందర్భంగా వినీత్ నారయణ్ తీర్పును ఉటంకిస్తూ వాదించారు. కాగా వర్మ, తదితరుల వినతిని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వ్యతిరేకించారు. వర్మ ఢిల్లీలోని అదే ఇంట్లో ఉంటున్నారు కనుక ఆయనను బదిలీ చేసినట్టు భావించడానికి వీలులేదని వేణుగోపాల్ వాదించారు. ఆయన ఇప్పటికీ అధికార ప్రయోజనాలన్నీ పొందుతూనే ఉన్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే(కాంగ్రెస్) తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ హాజరయ్యారు. ఆయన వర్మను పదవి నుంచి తప్పించిన సివిసి ఉత్తర్వును ప్రస్తావించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్(డిఎస్ ప్రావిజన్లను సివిసి, ప్రభుత్వం అధిగమించడానికి లేదని సిబల్ కోర్టుకు విన్నవించారు. సివిసి చట్టం కిందలేని అధికారాలతో వర్మను తొలగించారన్నారు. సిబిఐ డైరెక్టర్ చర తీసుకోవాలంటే సెలక్షన్ కమిటీ ద్వారానే జరపాలన్నారు. ‘ఒకవేళ ప్రభుత్వం సిబిఐ డైరెక్టర్ ఈ విధంగా తొలగిస్తే ఇక సిబిఐ స్వతంత్రకు తావెక్కడ ఉంటుంది?’ అని సీనియర్ న్యాయవాది సిబల్ ప్రశ్నించారు.
రెండేళ్ల నిర్దిష్ట పదవీ కాలాన్ని మార్చకూడదు!
RELATED ARTICLES