భారీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
జిఎస్టి సవరణ బిల్లుకు, 2018-19 పద్దులకూ గ్రీన్‌సిగ్నల్
ప్రజాపక్షం / హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో ఈనెల 22న ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2018- ఆర్థిక సంవత్సరం డిమాండ్లకు అనుబంధ గ్రాంట్లకు, జిఎస్టి సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమో దం తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం గురువారం ప్రగతి భవన్లో జరిగింది.శుక్రవారం ప్రార ంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర సొంత రాబడులు, పన్నేతర ఆదాయం బాగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పరిమాణం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఈసారి బడ్జెట్ రూ.రెండు లక్షల కోట్ల దాటవచ్చని భావిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెద్ద పద్దులన్నింటినీ సమగ్రం గా చేర్చినట్టు సమాచారం. చిన్నచిన్న పద్దులను బడ్జెట్లో పేర్కొన డం లేదు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హా మీల అమలుకు సంబంధించిన మొత్తాలను బడ్జెట్లో చేర్చినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ హామీల అమలుపై ఇప్పటికే పలుసార్లు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించగా, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోఅవసరమైన నిధుల వివరాలను పొందుపర్చాలని సూచించగా ఈ మేరకు అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.