HomeNewsLatest Newsరుణమాఫీ పారిశ్రామికవేత్తలకేనా? : రాహుల్

రుణమాఫీ పారిశ్రామికవేత్తలకేనా? : రాహుల్

ముగిసిన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల ప్రచారం
ఛరమ(ఛ‌త్తీస్‌గ‌ఢ్‌) : ఎంచుకున్న 15 మంది పారిశ్రామికవేత్తలకే రూ. 3.5 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రధాని నరేంద్ర మోడీ రుణమాఫీ చేశారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాక ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అవినీతిపై కూడా ధ్వజమెత్తారు. ఛత్తీస్ సోమవారం మొదటి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రెండో రోజు ప్రచారాన్ని కొనసాగిస్తూ రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేశారు. చిట్ కుంభకోణం, పౌర సరఫరాల కుంభకోణం, ముఖ్య మంత్రి కుమారుడు అభిషేక్ సింగ్ ఆయన విమర్శలు చేస్తూ రమణ్ సింగ్ ప్రభుత్వంపై ధజమెత్తారు.
‘గత నాలుగేళ్లలో 15 మంది సంపన్నులకు రూ. 3.5 లక్షల కోట్లను మోడీజీ ఇచ్చారు. కాగా దేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏడాది పొడవునా నడపడానికి రూ. 35,000 కోట్లు సరిపోతాయి. ఆ పథకం డబ్బుకు 10 రెట్ల మొత్తాన్ని మోడీ ఎంచుకున్న 15 మంది పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేశారు’ అని రాహుల్ ఆరోపించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments