ప్రజాపక్షం / హైదరాబాద్: రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం వారికి సిఎం కెసిర్ శాఖలను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసింది. సిఎం కెసిఆర్ వద్ద ఆర్థికశాఖ, నీటిపారుదల, రెవెన్యూశాఖ, విద్యుత్, మున్సిపల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ఉన్నాయి. కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
క్ర.సం. మంత్రి పేరు శాఖ
1. ఈటల రాజేందర్ వైద్య, ఆరోగ్యశాఖ
2. వేముల ప్రశాంత్ రెడ్డి రవాణా, రోడ్లు భవనాలు
3. గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విద్యాశాఖ
4. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యవసాయశాఖ
5. తలసాని శ్రీనివాస్‌యాదవ్ పశుసంవర్థకశాఖ
6. కొప్పుల ఈశ్వర్ సంక్షేమశాఖ
7. ఎర్రబెల్లి దయాకర్‌రావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్
8. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం,
9. వి.శ్రీనివాస్‌గౌడ్ ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు
10. చామకూర మల్లారెడ్డి కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి
రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు
RELATED ARTICLES