ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టీకరణ
ప్రజాపక్షం / అమరావతి; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎపి ప్రభుత్వం జారీ చేసిన జిఒలన్నీ రద్దు చేసింది. రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఇసి విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చి న ఆర్డినెన్స్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హై కోర్టు స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచి రమేశ్‌కుమార్ ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జికె మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎలక్షన్ కమిషనర్‌గా కొనసాగుతారని తెలిపారు. ఎన్నికల కమిషనర్‌గా కనగరాజు కొనసాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఆర్డినెన్స్ రద్దు కావడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఇసిగా ఉన్నట్టేనని వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని పిటిషనర్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. హైకోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డను తప్పించిన తీరు, కనగరాజును నియమించిన వ్యవహారం దోషపూరితంగా ఉందన్నారు. కోర్టు ఆదేశాలను సానుకూలంగా తీసుకోకపోతే ప్రభుత్వానికే నష్టమన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అనుమతితోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు చెప్పారు.
మళ్లీ పదవిలోకి వచ్చా: రమేశ్ కుమార్
హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ పదవిలోకి వచ్చానని నిమ్మగడ్డ ర మేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మార్పు వ్యవహారంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిస్థితులన్నీ అనుకూలించాక స్థాని క సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో మాదిరిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని వివరించారు. వ్యక్తులు శాశ్వతంగా ఉండరని, రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు చిరస్థాయిగా ఉంటాయని రమేశ్ కుమార్ అన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌ను నియమించండి
RELATED ARTICLES