రాళ్ళ క్వారీలో పేలుళ్ళు

ఆరుగురు మృతి
కర్నాటకలోని చిక్కబల్లాపూర్‌లో ప్రమాదం
గుజరాత్‌ రసాయన ఫ్యాక్టరీలో పేలుడు : 20 మందికి గాయాలు
చిక్కబల్లాపూర్‌/భరూచ్‌ : కర్ణాటకలో మంగళవారంనాడు ఓ రాళ్ళ క్వారీలో జరిగిన పేలుళ్ళలో ఆరుగురు మరణించారు. మరో ఇరవైమంది కార్మికులు గాయపడ్డారు. చిక్కబల్లాపూర్‌ రాళ్ళ క్వారీలో ప్రమాదవశాత్తు గిలిటెన్‌ స్టిక్స్‌ పేలడంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్‌ చేస్తూ మృతు ల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఈ ఘటనపై లోతైన విచారణ జరపాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాళ్ళ క్వారీ నుండి గిలిటెన్‌ స్టిక్స్‌ తొలగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈనియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి కె.సుధాకర్‌ వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళారు. యడ్యూరప్ప సంత పట్టణం శివమొగ్గలో కూడా జనవరి 22న ఇలాంటి ఘటనే జరిగి ఆరుగురు మరణించారు. ఫిబ్రవరి 7వ తేదీన క్వారీలో తవ్వకాలను పోలీసులు నిలిపివేశారు. కానీ కాంట్రాక్టర్‌ రహస్యంగా తవ్వకాలు చేయడంతో మరోసారి దాడులు చేశారు. మంగళవారంనాడు తెల్లవారు ఝామున గిలిటెన్‌ స్టిక్స్‌ను క్వారీలో అమరుస్తుండగా పేలుడు జరిగింది. అయితే తీవ్ర గాయాలతో ఒక డ్రైవర్‌ గిలిటెన్‌ స్టిక్స్‌ మూటతో అడవుల్లోకి పారపోయే ప్రయత్నం చేశాడు. తనను సమీప అడవుల్లో వదిలేయాల్సిందిగా అతడు ప్రాధేయపడ్డాడు.
కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు కాగా గుజరాత్‌ భారుచ్‌జిల్లాలోని ఒక రసాయన కర్మాగారంలో మంగళవారంనాడు పెద్ద పేలుడు సంభవించడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగి 23 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఐదుగురి జాడ తెలియడం లేదు. యునైటెడ్‌ ఫాస్పరస్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో ఔషధాల్లోక ఉపయోగించే రసాయనాలను తయారు చేస్తుండగా అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ పిహెచ్‌.వాసవ చెపారు. 15 అగ్నిమాపక వాహనాలు కృషిచేసి ఉదయం ఆరున్నరకు మంటలను అదుపు చేశాయి.

DO YOU LIKE THIS ARTICLE?