దేశంలో చీకటి రోజులకు ప్రధానమంత్రే కారణం
తన గోతిని తానే తవ్వుకుంటున్న నరేంద్రమోడీ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మహబూబ్నగర్ : లౌకికదేశంలో మతం పేరుతో జాతిని విచ్ఛిన్నం చేయడానికి బిజెపి కంకణం కట్టుకున్నదని, రాజ్యాంగంలోకి మను అధర్మశాస్త్రాన్ని జోప్పించేందుకు ప్రయత్నిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకే దేశం, ఒకే ప్రజ అని చెప్పుకునే బిజెపి నాయకులు… తమ అవసరాల కోసం ప్రజ ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మతం పేరుతో ప్రజలను విడదీయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని తమ అవసరాలు అనుగుణంగా సవరణలు చేస్తూ రాజ్యాంగ పీఠికకు తూట్లు పొడవాలని బిజెపి ప్రయత్నిస్తుందన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఆవిర్భావానికి ముందే హిందూ మతం ఉందనే విషయాన్ని మరిచిన బిజెపి నాయకులు హిందూ మతానికి మేము ప్రతినిధులమంటూ చెప్పుకోవడం విడ్డూరమన్నారు. కరువు కాటకాలు, వలసలకు పేరుగాంచిన పాలమూరు జిల్లాలో పాలమూరు ప్రాజెక్టు ద్వారా పంట పొలాలన్నీ సస్యశ్యామలమయ్యామని, అలాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం విడ్డూరమని కూనంనేని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముం దు బిజెపి జాతీయ నాయకులైన సుష్మా స్వరాజ్ పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పిన విషయాన్ని బిజెపి నేతలు మరిచిపోయారని ఆయన అన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగ్గా స్పందించకపోవడం పాలమూరు జిల్లాకు అన్యాయం చేయడమేనని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాగైతే త్వరితగతిన పూర్తి చేశారో పాలమూరు ప్రాజెక్టును కూడా అలాగే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఎగువన ఆల్మట్టి ఎత్తు పెంచడంతో కృష్ణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదనే విషయంలో ప్రభుత్వం కూడా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ, జాతీయ కౌన్సిల్ సభ్యులు డి.రాము, సిపిఐ జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్ జోగులాంబ గద్వాల్ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, సహయ కార్యదర్శి రామ్మోహన్, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు సురేశ్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రాజు, తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగంలోకి… మను అధర్మ శాస్త్రం
RELATED ARTICLES