ఆదుకున్న పుజారా, అర్పిత్
కష్టాల నుంచి గట్టెక్కిన సౌరాష్ట్ర
రాజ్‌కోట్: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న సౌరాష్ట్ర.. మాజీ చాంపియన్ బెంగాల్‌తో జరుగుతున్న ఫైనల్లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. అర్పిత్-, పుజారా సూపర్ ఇన్నింగ్స్‌తో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 160 ఓవర్లలో 8 వికెట్లకు 384 పరుగులు చేసింది. క్రీజులో చిరాగ్ జాని(13 బ్యాటింగ్), ధర్మేంద్ర జడేజా (13 బ్యాటింగ్) ఉన్నారు. 206 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును టీమిండియా క్రికెటర్ చతేశ్వర్ పుజారా(237 బంతుల్లో 5 ఫోర్లతో 66), అర్పిత్ వసవడ (287 బంతుల్లో 11 ఫోర్లతో 106) ఆదుకున్నారు. 206/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో సౌరాష్ట్ర రెండో రోజు ఆటను ప్రారంభించగా.. పుజారా-అర్పిత్ క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. బెంగాల్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో నిలదొక్కుకున్న ఈ జంట ఆరో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. దీంతో సౌరాష్ట్ర భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.
తేలిపోయిన బౌలర్లు..
తొలి రోజు సూపర్ పెర్ఫెమెన్స్ కనబర్చిన బెంగాల్ బౌలర్లు రెండో రోజు తేలిపోయారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు. చివరి సెషన్‌కు ముందు అర్పిత్, పుజారాను 10 పరుగుల వ్యవధిలోనే ఔట్ చేసిన బెంగాల్.. చివరి సెషన్‌లో మరో వికెట్ పడగొట్టింది. ఇక తొలి రోజు జ్వరంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగిన పుజారా.. రెండో రోజు బరిలోకి దిగి జట్టుకు అండగా నిలిచాడు. కాగా, ఈ మ్యాచ్‌లో పిచ్ మరీ దారుణంగా ఉందని బెంగాల్ టీమ్ కోచ్ అరుణ్ లాల్ అసహనం వ్యక్తం చేశాడు. ‘పిచ్ మరీ దారుణంగా ఉంది. బీసీసీఐ ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. బంతి అస్సలు పైకి రావట్లేదు. దుమ్ము లేవడంతో పాటు బంతి కింద నుంచి వెళ్తోంది’ అని అరుణ్ తెలిపాడు.
సంక్షిప్త స్కోర్లు :
సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 384/8 (160 ఓవర్లలో) (అర్పి త్ వసవడ 106, పుజారా 66, అవీ బారోట్ 54, విశ్వ రాజ్‌సింగ్ జడేజా 54, చిరాగ్ జాని 13 బ్యాటింగ్, ధర్మేం ద్ర జడేజా 13 బ్యాటింగ్, ఆకాశ్‌దీప్ 3/41, ముఖేష్ కుమార్ 2/83)
రసవత్తరంగా రంజీ ఫైనల్
RELATED ARTICLES