ఉత్సాహంగా పాల్గొన్న భారత కంటింజెంట్
మాస్కో : 1941- మధ్యకాలంలో మహా దేశభక్తియుద్ధం (రెండవ ప్రపంచయుద్ధం)లో సోవియట్ ప్రజలు వీరోచిత పోరాటం చేసి విజ యం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భం గా మాస్కోలోని చరిత్రాత్మక రెడ్స్కేర్లో బుధవారంనాడు 75వ విజయోత్సవ పెరేడ్ వైభవం గా జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో నాజీలపై జరిగే పోరాటంలో మిత్రపక్షాల బలగాల్లో బ్రిటిష్ ఇండియన్ సాయుధ బలగాలు కూడా పాల్గొన్నాయి. నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్రికన్, వెస్టర్న్ డిసెర్ట్, యూరోపియన్ థియేటర్ క్యాం పెయిన్లలో భారత కంటింజెంట్లు కూడా పాల్గొన్నాయి. ఇందులో 87,000 మంది భారతీయ సైనికుల త్యాగాలు మరువలేనివి. 34,354 మంది గాయపడ్డారు కూడా. ఈ విజయానికి గుర్తుగా బుధవారంనాడు రష్యా నిర్వహించిన పెరేడ్లో రష్యా సాయుధ బలగాలతోపాటు మ రో 17 దేశాలకు చెందిన బలగాలు కూడా పా ల్గొని కనువిందు చేశాయి. ఇండియన్ ట్రై సర్వీ స్ కంటింజెంట్ పేరుతో 75 శ్రేణులకు సంబంధించిన భారత సాయుధ బలగాలు కూడా ఈ పెరేడ్లో పాల్గొని, నాటి విజయాన్ని గుర్తు చేశా యి. ప్రస్తుతం రష్యా పర్యటనలో వున్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ పెరేడ్ వేదిక వద్ద ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ, 75 మంది స భ్యులతో కూడా భారత సాయుధ బలగాలు ట్రై సర్వీస్ కంటింజెంట్ ఈ పెరేడ్లో పాల్గొనడం భారత్కు ఎంతో గర్వకారణమని అభివర్ణించా రు. ఆనాటి సోవియట్ ప్రజల వీరోచిత పోరుకు ఇది నిదర్శనమని అన్నారు. ఇదొక ఆనందక్షణమని అన్నారు.
రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ
ప్రపంచ దేశాలన్నీ అన్ని రకాల మార్గాల్లోనూ అ త్యున్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉం దని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అ న్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 75 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ స మావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుం ది. ఈ సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా హాజరయ్యారు. కాగా, రక్ష ణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం మా స్కోలో భారత రాయబార కార్యాలయ ఆవరణ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రష్యాలో వైభవంగా విజయోత్సవ పెరేడ్
RELATED ARTICLES