న్యూఢిల్లీ: కొవిషీల్డ్ టీకా వేయించుకుంటే ఐరోపా దేశాలకు వెళ్లవచ్చు. యూరోపియన్ యూనియన్ (ఇయు)లోని ఎనిమిది దేశాలు, ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఐ స్ల్యాండ్, ఐర్లాండ్, స్పెయిన్, ఎస్టోనియా కొవిషీల్డ్ వ్యాక్సిన్ను గుర్తిస్తున్నట్టు ప్రకటించాయి. స్విట్జర్లాండ్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ను ఇప్పటికే గుర్తించింది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో టీకా తీసుకున్న విదేశీ ప్రయాణికులనే అనుమతించాలని ఐరోపా సమాఖ్య గ్రీన్ పాస్(టీకా పాస్పోర్ట్) విధానాన్ని అనుసరిస్తున్నారు. మరోవైపు యూరోపియన్ మెడికల్ ఎజెన్సీ కేవలం నాలుగు రకాల కరోనా టీకాలు, ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ను మాత్రమే ఆమోదిత వ్యాక్సిన్ల జాబితాలోకి చేర్చింది. ఫలితంగా భారత్లో తయారైన కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారికి అనుమతి లేదని అనుమానాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన భారత్ కొవిషీల్డ్తోపాటు భారత్లో తయారైన కొవాగ్జిన్ టీకాలను వేయించుకున్న వారిని కూడా అనుమతించాలని యుఇని కోరింది. లేని పక్షంలో అక్కడి నుంచి దేశంలోకి వచ్చే వారిపైన కూడా కొన్ని ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. కొంతకాలం తర్జనభర్జనల అనంతరం కొవిషీల్డ్ వ్యాక్సిన్ను కూడా అనుమతించిన టీకాల జాబితాలో చేరుస్తున్నట్టు ఇయులోని ఎనిమిది దేశాలు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి.. భారత్లో తయారైన టీకాలనూ గుర్తించాల్సిందేనంటూ ఈయూ దేశాలకు తేల్చి చెప్పింది. లేని పక్షంలో భారత్కు వచ్చే ఈయూ ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తప్పవని ఖరాఖండీగా చెప్పింది. దౌత్యపరంగా భారత్ తెస్తున్న ఒత్తిడి సత్ఫలితాలను ఇవ్వడంతో తొలిసారిగా తొమ్మిది ఈయూ దేశాలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవీషీల్డ్ను గుర్తిస్తున్నట్టు తాజాగా ప్రకటించాయి.
యుకెలో కొవిషీల్డ్ టీకాకు ఎనిమిది దేశాల గుర్తింపు
RELATED ARTICLES