HomeNewsBreaking Newsమొత్తం ధాన్యాన్ని కొంటాం

మొత్తం ధాన్యాన్ని కొంటాం

క్వింటాకు రూ.1960 చెల్లిస్తాం
రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ
తక్కువ ధరకు అమ్ముకోవద్దు
నేటినుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ముమ్మర చర్యలు : సిఎం కెసిఆర్‌ ప్రకటన

  1. జిఒ 111 ఎత్తివేత
    ఆరు ప్రైవేటు యూనివర్సిటీలకు గ్రీన్‌ సిగ్నల్‌
    గ్రూప్‌1,గ్రూప్‌ 2లకు ఇంటర్వ్యూ అవసరం లేదు
    మే 20 నుంచి జూన్‌ 5 వరకు పట్టణ, పల్లె ప్రగతి
    పోలీసు నియామకాల్లో వయోపరిమితి మూడేళ్లు సడలింపు
    రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు

ప్రజాపక్షం/హైదరాబాద్‌  యాసంగిలో వడ్లను కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. యుద్ధప్రాతిపదకన బుధవారం నుంచి చర్యలు తీసుకుంటమన్నారు. వడ్ల కొనుగోలు విషయంల వచ్చే వ్యత్యాసం, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరించాల్సి వస్తుందనే విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని, ఇందులో ఆర్థిక, వ్యవసాయ , నీటిపారుదల శాఖ కార్యదర్శులు ఉంటారని తెలిపారు.తక్కువ నష్టంతో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని, ధాన్యానికి ఎంఎస్‌పి ప్రకారం క్వింటాకు రూ.1960 చెల్లిస్తామని స్పష్టం చేశారు. రైతులకు బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులను చెల్లిస్తాని తెలిపారు. రెండు,మూడు రోజుల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్‌ మీడియా సమావేశంలో మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దుర్మార్గమైన అనాలోచిత విధానాలతో సంకుచిత రాజకీయాల కోసం మతోన్మాదాన్ని పేట్రేగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జిడిపి నాశనమైందని, నిరుద్యోగం పెరిగిందని, పరిశ్రమలు మూతడపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు పెంచుతూ, సామాన్యుల నడ్డీ విరిస్తోందని, ఆహాంకారాం తలకెక్కిందని, అధికార నిశ తలకెక్కిందని, ఎన్నికలు రాగానే కశ్మీర్‌ ఫైల్స్‌, పుల్వామా,
తోక తొండం, మత గజ్జి షార్ట్‌కట్‌ విధానాన్ని ఎంచుకుంటుందని, ప్రజలను ఉద్వేగపర్చి పది ఓట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. శ్రీరామనవమి సందర్భంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఎన్నికలు జరగని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. మత పిచ్చితో తాత్కాలిక రాక్షస ఆనందంతో అతిభారీ ముల్యం చెల్లించుకోక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత, మేథావులు కొట్టుకుపోతే వంద సంవత్సరాలు దేశం వెనక్కి పోతుందని అన్నారు. దేశ ప్రజలను, రైతులను చైతన్యపర్చడంలో తాను ప్రాముఖ పాత్ర పోషిస్తానన్నారు. ఎంఎస్‌పికి రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ, ఇంటిగ్రేటెడ్‌ న్యూ అగ్రికల్చర్‌ పాలసీ రావాల్సిన అసవరం ఉన్నదన్నారు. దీనిపై ఆర్థిక మేథావులు అశోక్‌ గులాటీ, రైతు నాయకులతో హైదరాబాద్‌లో వర్క్‌షాపు నిర్వహిస్తామని, ఆ పాలసీని ప్రకటిస్తామని, దీనిని ప్రభుత్వం అమలు చేయకపోతే రైతాంగా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని పక్కకు జరిపి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తెచ్చుకుని, నూతన పాలసీని అమలు చేసుకుంటరాని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి అధికార నిషా తలకెక్కింది
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అధికార నిషా తలకెక్కిందని, అందుకే అన్నీ ధరలను పెంచుతున్నారని సిఎం కెసిఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ను పెంచలేదని, తెలంగాణ చరిత్రలో పైసా పెంచలేదని స్పష్టం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం రోజుకు భారానా, ఒక రూపాయి పెంచిందని అన్నారు. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం రోజూ పన్నులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించుకోవాలా అని ప్రశ్నించారు. ఇంతకు కేంద్రం ఎందుకు పెరంచుతున్నారని, ‘మీరు పెంచాలి? మేము తగ్గించాలా’ అని అన్నారు.బ్యాంకులను ముంచుతున్న ఘరానా దొంగలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అత్యధికంగా సాధించిన ప్రగతి బ్యాంకులను దివాళ తీయించిన వారిని రక్షించమేనని అన్నారు. లండన్‌లో పిక్‌నిక్‌ చేస్తున్న కార్పొరేట్‌ గద్దల అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన సిబిఐ బృందాన్ని కేంద్రం ప్రభుత్వం వెనక్కి రప్పించిందని, దీనికి సంబంధించి త్వరలోనే వారి పాపాల పుట్ట ను బయట పెడుతామని వెల్లడించారు.
జివో 111 ఎత్తివేస్తూ నిర్ణయం
జివో 111ను ఎత్తివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది.పర్యావరణ, అటవీశాఖ కలిపి మూసి,ఇసి నది రెండు జలాశయాలను కలుషీతం కాకుండా, గ్రీన్‌జోన్స్‌ నిర్ణయిస్తామని,మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయాలని నిర్ణయించారు. మే 28 నుంచి జూర్‌ 5 వరకు పట్టణ , పల్లె ప్రగతి చేపట్టాలని నిర్ణయించింది. ఆరు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆమోదించింది. ఇందులో కావేరి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ,కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా,గురునానక్‌,ఎంఎన్‌ఆర్‌, ఫార్మా యూనివర్సిటీ, సివిల్‌ అవియేషన్‌ ఉండబోతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో 3500 వరకు బోధన, బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో కామన్‌ బోర్డ్‌ ద్వారా నియమిస్తామని సిఎం కెసిఆర్‌ వెల్లడించారు. ఆయా యూనివర్సిటీలకు నియమించి సిబ్బందిని అప్పగిస్తామని తెలిపారు.ఎవరికి వారుగా పోస్టులను నియమించడంతో కొన్ని రకాల ఇబ్బందులు, ఆరోపణలు వస్తున్నాయని, అందుకే కామన్‌ బోర్డ్‌ ఏర్పాటు చేస్తామమని పారదర్శకంగా నియమిస్తామని తెలిపారు.ప్రపంచంలోనే ఎవ్వరూ ఇవ్వని విధంగా రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందజేస్తున్నామని, ఇది భూగోళంలోనే ఎవ్వరూ ఇవ్వడం లేదని సిఎం అన్నారు. 24 గంటలక ఉచిత విద్యుత్‌, ఉచిత నీటి సరఫరా చేస్తున్నామని, గతంలోని నీటి తిరువ తీసుకోవడం లేదని, ఇది కూడా ఏ రాష్ట్రాలు కూడా ఇవ్వడం లేదని, ప్రధాని రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా ఇవ్వడం లేదని తెలిపారు. రైతులు మరణిస్తే రైతుభీమాను అమలు చేస్తున్నామని పునరుద్ఘాటించారు. 2014- నుంచి 2022 సంవత్సరం వరకు కోటీ ఎకరాల పై చీలుకు విస్తీర్ణం పెరిగిందని సిఎం కెసిఆర్‌ తెలిపారు. పంటలు బాగా పండుతున్నాయన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో 13నెలల పాటు ఉద్యమిస్తే , వారిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తూలనాడి, ఉగ్రవాదులని, ఆందోళన జీవులని, అవమానించి చివరకు ప్రధాని క్షమాపణ చెబుతూ చట్టాలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రధాని క్షమాపణ చెప్పిన దిక్కుమాలిన దరిద్య్రగొట్టు ప్రభుత్వమని ధ్వజమెత్తారు.వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌లకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన కుట్ర చేస్తోందని సిఎం కెసిఆర్‌ విమర్శించారు. రైతులు తమ భూములు కార్పొరేట్లకు అప్పగించి, అందులో వారు జీతగాళ్లుగా పనిచేయాలని కుట్ర ఉన్నదని, దీనిని దృష్టిలో పెట్టుకుని అనేక కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేస్తామని బిజెపి తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందపర్చినప్పటికీ వాటిని అమలు చేయరన్నారు. ఎరువులపైన ధరలు పెంచారన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లను పెంచాలని దిక్కుమాలిన విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బిఎం అనుసంధానం చేశారన్నారు. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయాలని, బలహీనపర్చాలని అంతర్గత కుట్రలోనే భాగమని ఆరోపించారు.
తెలంగాణ స్థాయి కూడా కేంద్రానికి లేదు
తెలంగాణ రాష్ట్రానికి ఉన్న స్థాయి కేంద్రానికి లేదని, కేంద్రానికి పరిపాలన చేతకాక, సాధించలేని లక్ష్యాలు, గమ్యాలను కేంద్రం జీర్ణించుకోలేక ‘ క్యాచమత్కార్‌ ఒగయారే’ అని వ్యాఖ్యానించారని సిఎం అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో చిక్కిరిబిక్కిరిగా, వితండ వాదం, తలా తోకం లేకుండా కేంద్రం వ్యవహారించిందని సిఎం కెసిఆర్‌ విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి రైతులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించి మట్లాడారని, ఆయనకు మెదడు ఉన్నదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు పండించి దేశానికి ఇచ్చి, నూకలు తినాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నూకల శాతం ఎక్కువ అంతే
యాసంగి వడ్లలో నూకల శాతం ఎక్కవగా ఉంటుందని, ఇందులో పెద్ద బ్రహ్మపదార్థం లేదని అన్నారు. వంద కిలలో వడ్లకు 67కిలోల బియ్యం వస్తుందని, యాసంగిలో సగం మాత్రమే 30 నుంచి 35 శాతం వస్తుందని వివరించారు. ఎఫ్‌సిఐ ధాన్యం తీసుకోవడం ద్వారా రూ. 5వేల నుంచి రూ.10 వేల కోట్లు నష్టం వస్తుందని, దీనిని కూడా కేంద్రం భరించాలని, దీనిని భరించలేమని చెప్పలేక , కేంద్రం తెలివి తక్కువ ప్రభుత్వమని,దుర్మార్గమైన నీచమైన ప్రచారం జరుగుతుందని తెలిపారు.

బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు ఇదే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానం
బలమైన కేంద్రప్రభుత్వం, బలహీనమైన రాష్ట్రాలు ఉండాలన్నదే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానమని సిఎం కెసిఆర్‌ అన్నారు. రాష్ట్రాలు వారి చప్పుచేతల్లో ఉండాలనేది వారి దిక్కుమాలిన సిద్ధాంతమని, రాష్ట్రాలు బిచ్చగాళ్ల తరహా కేంద్రం వద్ద ఉండాలా? అని ప్రశ్నించారు.అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వాల్సింది పోయి, రాష్ట్రాలకు అధికారాలను తీసుకుంటూ. రాష్ట్ర పన్నులు తగ్గించాలనడం ఏమిటని, కేంద్రం నీతి ఇదేనా అని ప్రశ్నించారు. వారిది ‘నోరా?మోరా?’ ఏ నోరుతో తగ్గించాలని చెబుతారు..ఇది నీతా?” అని అన్నారు. ఆహార భద్రత నుంచి తప్పించుకునేందుకే కేంద్రం అరాకిరీకిరీ చేస్తుందన్నారు.

గ్రూప్‌1,గ్రూప్‌ 2లకు ఇంటర్వ్యూ అవసరం లేదు
గ్రూప్‌1,గ్రూప్‌ 2, ఇతర గెజిట్‌ పోస్టుల నియామకాల్లో పారదర్శకత నిమిత్తం కేవలం లిఖిత పరీక్షనే ప్రమాణంగా తీసుకోవాలని, ఇంటర్వ్యూ అవసరం లేదని రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. గతంలో ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ పరిమితిని 65 సంవత్సరాలకు పెంచింది. తాజాగా మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్లను డైరక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, అడిషనల్‌ డైరక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌గా నియమించడానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సారపాక, భద్రాచలం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీ కరించాలనే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితిలో 3 సంవత్సరాలు సడలించాలని కేబినేట్‌ నిర్ణయించింది. మే నెల 20 నుండి జూన్‌ 5వ తేదీ వరకు “పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి” కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. “చెన్నూరు ఎత్తిపోతల పథకానికి” మంత్రివర్గం ఆమోదించింది. నియోజక వర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌కు రూ.1658 కోట్లు మంజూరు చేసింది. గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఈ పథకానికి వినియోగించనున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments