మెస్సీ ఉదారత

కొరోనాపై పోరాటానికి 8 కోట్లు విరాళం
బార్సిలోన: సాకర్ దిగ్గజం,  అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఉదారతను చాటుకున్నాడు. మహమ్మారిపై పోరాడెందుకు తన వంతు సాయం ప్రకటించాడు. స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా ఎఫ్‌సీ ఫార్వార్డ్ ప్లేయర్ అయిన మెస్సీ.. ఒక మిలియన్ యూరోలను విరాళంగా ప్రకటించాడు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.8.2 కోట్లు. ఈ డొనేషన్‌లో సగం బార్సీలోనా ఆసపత్రులకు మిగతాది తన సొంత దేశం అర్జెంటీనాలో ఖర్చు చేయనున్నారని మార్కలోని ఒక నివేదిక తెలిపింది. కరోనావైరస్‌పై పోరాడేందుకు లియోనల్ మెస్సీ ఆసుపత్రులకు విరాళాన్ని ప్రకటించాడని సంబంధిత క్లినిక్స్ తెలిపాయి. ‘నీ కమిట్‌మెంట్ మద్దుతగా ధన్యవాదాలు లియో’ అంటూ ట్వీట్ చేశాయి.

DO YOU LIKE THIS ARTICLE?